Chikoti Praveen Case: క్యాసినో కేసులో కీలకంగా ఉన్న చీకోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు ప్రవీణ్ ను లోతుగా విచారిస్తున్నారు. క్యాసినో వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులతో తనకు సంబంధాలున్నాయని ప్రవీన్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 7 నుంచి విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఆదేశించింది. ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో పాటు ఆయన వాట్సాప్ చాట్ ఆధారంగా నలుగురికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. విదేశీ క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ ను ఇప్పటికే విచారిస్తున్న ఈడీ తాజాగా ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

ప్రవీణ్ వాట్సాప్ ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు వారిని నేరుగా విచారించడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఈ నలుగురు ప్రజాప్రతినిధులు తెలంగాణకు చెందిన వారేనని తెలుస్తోంది. అయితే ఓ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వీరు చీకోటి ప్రవీణ్ తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు..? బిజినెస్ వ్యవహారంలోనా..? లేక ప్రభుత్వం తరుపున ప్రవీణ్ కు ఏ విధమైన సాయం చేశారా..? అనేది విచారణలో తేలనుంది.
Also Read: Modi- Jagan: మోడీకి హ్యాండిచ్చిన జగన్..ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను ఈ వ్యవహారంపై మీడియా ప్రశ్నించింది. నేను క్యాసినో బిజినెస్ చేస్తున్నానని, ఇందులో తప్పేముంది..? అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తనకు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయని అన్నారు. ఈడీ అధికారులకు కూడా ఇదే సమాధానం ఇచ్చానని తెలిపారు. దీంతో ఈడీ అధికారులు ప్రవీణ్ చెప్పిన సమాచారం ఆధారంగా ఆయనతో సంబంధాలున్న ప్రజాప్రతినిధులను ఈడీ విచారించనుంది. ఆ తరువాత సినీ ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ రాజకీ ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలను తీసుకొని వారు విదేశాల్లో క్యాసినో ఆడేందుకు డాలర్లను ఏర్పాటు చేయడం చీకోటి ప్రవీణ్ వ్యాపారమని ఈడీ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖుల నల్ల ధనాన్ని హవాలా రూపంలో అందుబాటులోకి తెస్తున్నారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందు చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని ప్రవీణ్ ఇప్పటికే పోలీసులను కోరాడు. తన గురించి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈడీ విచారణ పూర్తయిన తరువాత అన్ని విషయాలు చెబుతానని, కానీ ఇప్పుడు ప్రసారం అవుతున్నదంతా అవాస్తవమని అన్నారు. ఫేస్బుక్ లో నా పేరుతో కొందరు అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్నారన్నారు.
Also Read:China-Taiwan Conflict: తైవాన్ కు అండగా అమెరికా.. చైనాతో యుద్ధం తప్పదా?
[…] Also Read: Chikoti Praveen Case: చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం… […]
[…] Also Read:Chikoti Praveen Case: చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం… […]