Vice Presidential Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శనివారం సాయంత్రానికి ఎవరనేది తేలనుంది. అయితే పరిస్థితి చూస్తుంటే ఎన్డీఏ మద్దతు అభ్యర్థి జగదీప్ దన్ ఖడ్ విజయం లాంఛనమేనన్నట్టు ఉంది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్డీఏ మద్దతుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి పదవి కూడా ఎన్డీఏ మద్దతు అభ్యర్థికే దక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతి దేశంలో అత్యున్నత రెండో పదవి. రాష్ట్రపతి ప్రథమ పౌరుడు, పౌరురాలు అయితే.. ఉప రాష్ట్రపతి రెండో పౌరుడు, పౌరురాలు. ఇది రాజ్యాంగబద్ధ పదవి అయినా ప్రజాప్రతినిధులు ఎన్నుకోనుండడంతో రాజకీయం సంతరించుకుంది. బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ ను అధికార ఎన్డీఏ ఎంపిక చేసింది. విపక్ష కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు మార్గెట్ ఆల్వా బరిలో ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించలేదని.. విపక్ష కూటమిలో కీలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీనుక వహించారు. తటస్థంగా ఉండనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి బలం తగ్గింది. ఎన్డీఏకు ఇది లాభించింది.

బలాబలాలివి..
విపక్ష కూటమి అభ్యర్థి మార్గెట్ ఆల్వాకు టీఆర్ఎస్, అమ్ఆద్మీ, ఝార్కండ్ ముక్తీ మోర్చా, మజ్లీస్, సమాజ్ వాదీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైసీపీ, బీజేడీ,జేడీయూ, బీఎస్పీ, ఏఐడీఎంకే, శివసేన పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్ ఖడ్ కు మద్దతు తెలిపాయి. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ దన్ ఖడ్ కు 515 ఓట్లు లభించే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతిగా విజయం సాధించేందుకు తగ్గ మ్యాజిక్ ఫిగర్ కావడంతో ఎన్డీఏ అభ్యర్థి విజయం లాంచనమే. ఆల్వాకు అటుఇటుగా 200 ఓట్లు లభించే అవకాశముందని అంచనా.
Also Read: Chikoti Praveen Case: చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం: 3 తెలంగాణ ఎమ్మెల్యేలు, ఒక ఏపీ ఎమ్మెల్యే బుక్
విపక్షాల మధ్య చీలిక..
అయితే రాష్ట్రపతి ఎన్నికలకు ముందు విపక్షాలన్ని ఐక్యంగా కనిపించాయి. రాష్ట్రాల రాజకీయ పరిస్థితులతో కాకుండా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకెళదామని భావించాయి. కానీ రకరకాల కారణాలతో ఒక్కో పార్టీ వెనక్కి తగ్గింది. అటు రాష్ట్రపతి అభ్యర్థిగా తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను నిర్ణయించారు. కానీ ఆయన అయిష్టత చూపారు. తరువాత రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా చివరకు యశ్వంత్ సిన్హాను ఖరారు చేశారు. అటు ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఐక్యతకు రాలేకపోయారు. తమను సంప్రదించకుండానే మార్గెట్ ఆల్వాను ప్రకటించారని టీఎంసీ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

మార్గెట్ ఆల్వాకే టీఆర్ఎస్ మద్దతు..
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన విపక్షంగా ఉన్న.. టీఆర్ఎస్ మాత్రం అనూహ్యంగా మార్గెట్ ఆల్వాకు మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు శుక్రవారం విషయాన్ని ప్రకటించారు. తమకున్న 16 మంది సభ్యులు మార్గెట్ ఆల్వాకు ఓటు వేస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో మార్గెట్ ఆల్వా టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రాష్ట్రంలో విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నా.. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
Also Read:China-Taiwan Conflict: తైవాన్ కు అండగా అమెరికా.. చైనాతో యుద్ధం తప్పదా?
[…] […]
[…] […]