Homeఎంటర్టైన్మెంట్Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ... ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్!

Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ… ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్!

Virupaksha Twitter Review
Virupaksha Twitter Review

Virupaksha Twitter Review: సాయి ధరమ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. 2022లో ఆయన నుండి ఒక్క మూవీ రాలేదు. ప్రమాదం నుండి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి చిత్రం విరూపాక్ష. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే కార్తీక్ దండు. ఈ చిత్రానికి సుకుమార్ కథ కూడా అందించడం మరొక విశేషం. సుకుమార్ శిష్యులకు మంచి సక్సెస్ రికార్డు ఉంది. ఉప్పెన బుచ్చిబాబు ఆయన స్కూల్ నుండి వచ్చిన దర్శకుడే. ఈ క్రమంలో విరూపాక్ష చిత్రం మీద అంచనాలు ఏర్పడ్డాయి.

ఏప్రిల్ 21న రంజాన్ కానుకగా వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో విరూపాక్ష చిత్రం మీద ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ విరూపాక్ష చిత్రం మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. విరూపాక్ష మంచి చిత్రమని అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సినిమాకు హైలెట్ అంటున్నారు.

పట్టుసడలని స్క్రీన్ ప్లేతో సస్పెన్సు ఫ్యాక్టర్ మిస్ కాకుండా ఆద్యంతం కథను ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడంటున్నారు. అదిరిపోయే ట్విస్ట్స్, గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు సినిమాలో అనేకం ఉన్నాయని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ రోల్ లో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఆయన ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామర్ మరొక హైలెట్ పాయింట్.

Virupaksha Twitter Review
Virupaksha Twitter Review

బీజీఎం అబ్బురపరిచిందన్న మాట వినిపిస్తోంది. అయితే హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ లవ్ ట్రాక్ ఆకట్టుకోలేదంటున్నారు. విరూపాక్ష చిత్రం విషయంలో వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ మైనస్ పాయింట్ ఇది. రొమాంటిక్ ఎపిసోడ్స్ కథలో ఇమడలేదు. అసహజంగా అనిపించాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే విరూపాక్ష గుడ్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. మంచి మూవీ చూశామన్న భావన కలిగిస్తుంది.

విరూపాక్ష రూపంలో సాయి ధరమ్ తేజ్ కి హిట్ పడ్డట్లు అర్థం అవుతుంది. ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూస్ ఇస్తుండగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పండగే చిత్రం అనంతరం సాయి ధరమ్ తేజ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. విరూపాక్ష కమర్షియల్ హిట్ కొడితే ఆయన కెరీర్ కి ప్లస్ అవుతుంది. మరి పూర్తి రివ్యూ చూస్తే సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో ఒక అంచనాకు రావొచ్చు…

https://twitter.com/Why_Rattan/status/1649240932833968129

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version