రూ.20కే అమెజాన్ ప్రైమ్.. ఓటీపీలతో కొత్తరకం మోసం..?

సైబర్ మోసగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి మోసగాళ్లు మరో కొత్తరకం మోసానికి పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా సైబర్ మోసగాళ్లు 129 రూపాయలుగా ఉన్న అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని కేవలం 20 రూపాయలకే ఇస్తామంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. 20 రూపాయలకే తాము చెప్పిన వన్ టైమ్ పాస్ వర్డ్ తో అమెజాన్ ప్రైమ్ సేవలను వినియోగించవచ్చంటూ సైబర్ మోసగాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. Also Read: గురువారం […]

Written By: Navya, Updated On : February 25, 2021 2:24 pm
Follow us on

సైబర్ మోసగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి మోసగాళ్లు మరో కొత్తరకం మోసానికి పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా సైబర్ మోసగాళ్లు 129 రూపాయలుగా ఉన్న అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని కేవలం 20 రూపాయలకే ఇస్తామంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. 20 రూపాయలకే తాము చెప్పిన వన్ టైమ్ పాస్ వర్డ్ తో అమెజాన్ ప్రైమ్ సేవలను వినియోగించవచ్చంటూ సైబర్ మోసగాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు.

Also Read: గురువారం తెల్లని వస్తువులను దానం చేస్తే…!

నెట్ ఫ్లిక్స్ రెండు నెలల సబ్ స్క్రిప్షన్ ను కేవలం 25 రూపాయలకే ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. టెలీగ్రామ్ మెసేంజర్ ద్వారా వాళ్లు ఈ తరహా ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఇతర ఓటీటీలను కూడా తక్కువ ధరలకే సైబర్ మోసగాళ్లు ఆఫర్ చేస్తూ ఉండటం గమనార్హం. సైబర్ మోసగాళ్లు ఈ విధంగా చేయడం వల్ల ఓటీటీలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఓటీపీ బయ్యర్స్, సెల్లర్స్ పేరుతో గ్రూపులను క్రియేట్ చేస్తున్నారు.

Also Read: వెలుగులోకి కొత్తరకం మోసం.. ఖాళీ అవుతున్న ఏటీఎంలు..?

ఎంతమంది 20 రూపాయలు పంపితే అంతమందికి ఓటీపీలను పంపుతూ సైబర్ మోసగాళ్లు ఈ మోసాలను చేస్తున్నారు. తక్కువ ధరలకే ఓటీటీలలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూడాలని అనుకునేవారిని వీళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోసాల కోసం సైబర్ మోసగాళ్లు వర్చువల్ మొబైల్ నంబర్లను వినియోగిస్తూ ఉండటం గమనార్హం. సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఘటన వల్ల ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఒక యువతిని ఒక వ్యక్తి వర్చువల్ నంబర్ తో వేధింపులకు గురి చేయగా పోలీసులు ఎంతో శ్రమించి నిందితుడిని గుర్తించారు. సాధారణంగా ప్రైవేట్ సంభాషణల కోసం ఎవరైనా వర్చువల్ నంబర్లను వినియోగించడం జరుగుతుంది. వర్చువల్ ఫోన్ నంబర్లు వేర్వేరు ప్రాంతాలను చూపిస్తూ ఉండటంతో సైబర్ మోసగాళ్లను గురించడం పోలీసులకు సమస్యగా మారింది