RRR Glimpse: ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టుగా.. ఎంత పద్ధతిగా సినిమాకు జక్కన్న రాజమౌళి ప్రాణం పోస్తారో ఆయన సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది. బాహుబలి తర్వాత విశ్వవ్యాప్తం అయిన దర్శకధీరుడి ప్రతిభ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో మరో మెట్టు ఎక్కుతుందని తేలిపోయింది.

ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్ లలో రణం, రౌద్రం కనిపించింది. ఇప్పుడు అంతకుమించిన టీజర్ ను రాజమౌళి తాజాగా రిలీజ్ చేశాడు. అదిప్పుడు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.
ఇప్పటిదాకా రాజమౌళి దాచేసిన ‘ఆర్ఆర్ఆర్’లోని హైలెట్ సీన్ ను ఈ టీజర్ లో బయటపెట్టేశాడు. అదేంటంటే.. ‘ఒక పులితో కొమురంభీం (ఎన్టీఆర్) చేసే ఫైట్ సీన్ ను డ్రోన్ కెమెరాతో పైనుంచి చూచాయగా చూపించారు. ఒక పులి వెంటాడుతుంటే ఎన్టీఆర్ పరిగెడుతున్న సీన్ కనిపించింది.ఇది సినిమాకే హైలెట్ అని.. అత్యద్భుతంగా తీశాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు దాన్ని చూపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
టీజర్ మొదటి నుంచి చూస్తే బ్రిటీష్ వారిపై ప్రజల తిరుగుబాటును మొదటి సీన్ గా చూపించారు. రెండో సీన్ లో ఎన్టీఆర్ ను వేటాడుతున్న పులిని చూపించాడు.ఆ తర్వాత మొదట ఎన్టీఆర్ ను.. రెండో షాట్ లో రాంచరణ్ పౌరుషాలను కనువిందు చేశారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవ్ గన్ గన్ తో బ్రిటీష్ వారిని కాల్చే సీన్ హైలెట్ అని చెప్పొచ్చు.
మధ్యలో బ్రిటీష్ వారితో పోరాడుతున్న ఎన్టీఆర్, రాంచరణ్ ప్రజల పోరాటాన్ని ఓ రేంజ్ లో చూపించారు.ఈ పోరాటంలో ఒక పులి సైతం బ్రిటీష్ వారిపై తిరగబడిన సీన్ హైలెట్ అని చెప్పొచ్చు. ఆలియా భట్ కూడా ఇందులో కనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీన్లు నభూతో నభవిష్యతి అన్నట్టుగా రాజమౌళి తీసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ టీజర్ మొత్తంలో కనిపించని హీరోయిన్ ఓలివియా మోరిస్. కొమురం భీం ఎన్టీఆర్ లవర్ గా చేస్తున్న ఈమెను రాజమౌళి దాచేశాడు. ఈ గ్లింప్స్ లోనూ చూపించలేదు.అలాగే బ్రిటీష్ విలన్లను కూడా ఈ టీజర్ లో చూపించకపోవడం గమనార్హం. వారి హంగామా ఎలా ఉంటుందనేది రాబోయే టీజర్లలోనే చూస్తాం కావచ్చు. గ్లింప్స్ చూస్తే దాదాపుగా సినిమా అయిపోయిందని తెలుస్తోంది. కొంచెం మసాలా యాడ్ చేస్తున్నారని అర్థమవుతోంది.
Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” నుంచి సెకండ్ గ్లింప్స్ రిలీజ్ … రికార్డుల మోత ఖాయం
రాజమౌళిలోని ఓ ప్రత్యేక గుణం ఏంటంటే.. ప్రేక్షకుడు ఊహించని విధంగా సినిమాను ప్రెజెంట్ చేయడం ఆయన ఊహకే చెల్లింది. నెక్ట్స్ ఏంటి అనేది ప్రేక్షకుడు కనిపెడితే సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇక విజువల్ వండర్ గా అబ్బురపరిస్తే హిట్ కొడుతుంది. మన మనసులో చాలా ఊహించుకుంటాం. అవన్నీ తెరపైన నిజంగా కనిపిస్తే ఔరా అంటాం. ఇప్పుడు రాజమౌళి అదే అద్భుతాన్ని ‘ఆర్ఆర్ఆర్’ తో సాధ్యం చేశాడని అనిపిస్తోంది.గ్రాఫిక్స్ మాయాజాలమా? లేక యాక్షన్ పోరాటాలా? ఏది అయితేనేమీ.. రాజమౌళి మరో అద్భుతాన్నే ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులకు చూపించబోతున్నాడని ‘ఆర్ఆర్ఆర్ గ్లింప్స్’ చూస్తే అర్థమవుతోంది.
ఈ ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ను కింద చూడొచ్చు
