మనల్ని బానిసలుగా మార్చి పాలించిన బ్రిటీషర్లను మనమే పాలించే అద్భుత అవకాశం తాజాగా రాబోతోంది. బ్రిటన్ ప్రధాన మంత్రిగా మన భారతీయ సంతతి వ్యక్తి అవ్వడానికి అడుగు దూరంలో ఉన్నారు కన్జర్వేటివ్ పార్టీలో ప్రధాని పదవికి రేసు మొదలైంది. చాలా మంది మధ్య పోటీ నిర్వహించగా.. చివరికి ఇద్దరే మిగిలారు. వారిలో ఒకరు మన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ కాగా.. మరొకరు లిజ్ ట్రూస్. చివరి రౌండ్ పోటీలో అందరూ ఓడిపోగా.. ఈ ఇద్దరూ టాప్ 2లో నిలిచారు. దీంతో యూకేకు కాబోయే ప్రధానిగా వీరిద్దరిలో ఒకరు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

కన్జర్వేటివ్ పార్టీలో ఓటింగ్ తర్వాత ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. రిషి సునక్, లిజ్ ట్రూస్ లలో ఒకరు బ్రిటన్ ప్రధాని పదవిని అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రిటన్ లో ఎవరు అధికారంలోకి వస్తారన్నది భారత్ లో ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే భారత్, బ్రిటన్ ల మధ్య ధృడమైన ఆర్థిక, సాంస్కృతిక చారిత్రక సంబంధాలు ఉన్నాయి.
బ్రిటన్ లేదా కామన్వెల్త్ దేశాలకు బయట జన్మించినప్పటికీ బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికల్లో పోటీచేయవచ్చు. బ్రిటన్ లేదా కామన్వెల్త్ దేశాలకు బయట జన్మించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ న్యూయార్క్ లో జన్మించాడు. అయినా ప్రధాని కాగలిగాడు. ప్రస్తుతం మన రిషి సునఖ్ బ్రిటన్ లోనే జన్మించినా ఆయన తల్లిదండ్రులు కెన్యా, భారత్ కు చెందిన వారు. అయినా ఇప్పుడు కాబోయే ప్రధానిగా పోటీపడుతున్నారు. ఇక రిషి సునక్ గత బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా కొనసాగారు. జాన్సన్ పాలన నచ్చక తొలి రాజీనామా చేసింది రిషి సునక్ కావడం గమనార్హం.
కన్జర్వేటివ్ చట్టసభ సభ్యులలో అన్ని రౌండ్ల ఓటింగ్‌లో సునక్ ముందున్నారు. కానీ కన్జర్వేటివ్ పార్టీలోని క్రియాశీల 200,000 మంది పాలక పక్ష సభ్యులలో ఇప్పటివరకు రిషి ప్రత్యర్థి అయిన ట్రస్‌కు ఎక్కువ ఓట్లు లభించాయి. చివరికి విజేత ఎవరు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.
సెప్టెంబరు 5న ఫలితాలు వెలువడినప్పుడు ఎవరు బ్రిటన్ ప్రధానిగా విజయం సాధిస్తారో వారు దశాబ్దాల తరబడి బ్రిటన్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితులను వారసత్వంగా పొందుతారు. ద్రవ్యోల్బణం ఏటా 11%కి చేరుకుంటుంది, వృద్ధి నిలిచిపోతోంది, పారిశ్రామిక చర్య పెరుగుతోంది. డాలర్‌తో పోలిస్తే పౌండ్ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకుంది.
బ్రిటన్ ప్రధాని రేసులో మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే బుధవారం జరిగిన కన్జర్వేటివ్ చట్టసభ సభ్యుల ఐదో.. చివరి బ్యాలెట్‌లో జూనియర్ వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ ఓడిపోయి వైదొలిగారు. ఈ పోటీలో రిషి సునక్‌కి 137 ఓట్లు, ట్రస్‌కి 113, మోర్డాంట్‌కి 105 ఓట్లు వచ్చాయి.
అయితే పార్టీ క్రియాశీల సభ్యుల పోటీలో ట్రస్ సునక్‌ను ఓడించగలదని పోల్స్ చూపిస్తున్నాయి. వెస్ట్‌మినిస్టర్‌లో చట్టసభ సభ్యులకు అత్యంత ప్రజాదరణ లేని నాయకుడిని పార్టీ ఎన్నుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. రిషి సునక్ భారత సంతతికి చెందిన వాడు కావడం.. ట్రస్ బ్రిటన్ కు చెందిన వాడు కావడం వల్లే అతడికి క్రియాశీల సభ్యుల ఓట్లు పడుతున్నాయి. దీంతో ప్రధాని పదవికి ఎంపీల ఓట్లు తక్కువగా వచ్చినా ట్రస్ ప్రధాని రేసులో ముందున్నారని చెప్పొచ్చు.
ట్రస్ తన మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని చక్కదిద్దుతానని అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు..
సునక్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. “ఈ రోజు నా సహోద్యోగులు నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. దేశమంతటా మా సందేశాన్ని అందించడానికి నేను రాత్రింబవళ్లు కృషి చేస్తాను.” అని తెలిపారు.
కోవిడ్19 మహమ్మారి లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో సహా నెలల తరబడి కుంభకోణాలు బయటపడడంతో జాన్సన్ చట్టసభ సభ్యుల మద్దతును కోల్పోయారు. తరువాత ఈ నెలలో రాజీనామా చేయవలసి వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ కు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈనెల ప్రారంభంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కూలడానికి రిషి సునక్ కారణం. మొదట రిషినే రాజీనామా చేయడంతో జాన్సన్ పతనం ప్రారంభమైంది. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో చాలా మంది రిషిని నిందించడంతో పార్టీ సభ్యులలో ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వంలో అతని రికార్డు నుండి అతని భార్య సంపద వరకు ప్రతిదానిపై విమర్శలు ఎదుర్కొన్నాడు.
రిషి సునక్, ట్రాస్ ఇద్దరు అభ్యర్థులు జాన్సన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి పదవులలో పనిచేశారు. ఇప్పుడు ప్రధాని పదవిలో పోటీపడుతున్నారు.వీరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది ఆసక్తిగా మారింది.
మన రిషి సునక్ ప్రధాని అయితే మాత్రం మనల్ని పాలించిన వారికి మనమే పాలకులుగా ఒక కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. కానీ వేరే దేశాల మూలాలు ఉండడం.. బ్రిటన్ వాసి కాకపోవడం.. పార్టీలోని క్రియాశీల సభ్యుల మద్దతు తక్కువగా ఉండడంతో రిషికి చివరి ఎన్నికల్లో గట్టెక్కడం కాస్త కష్టమే. అయితే ఎంపీలందరూ రిషినే కోరుకుంటున్నారు. చివరలో ఏదైనా అద్భుతం జరిగితే మాత్రం రిషి బ్రిటన్ ప్రధాని అయ్యి కొత్త చరిత్ర లిఖించడం ఖాయం.