Homeజాతీయ వార్తలుRevanth Reddy vs Nirmala : రేవంత్ ను హేళన చేసింది కాంగ్రెస్.. నెపం నిర్మలపై.....

Revanth Reddy vs Nirmala : రేవంత్ ను హేళన చేసింది కాంగ్రెస్.. నెపం నిర్మలపై.. పచ్చమీడియానా మజాకా!

Revanth Reddy Nirmala : నిన్న పార్లమెంట్ లో జరిగిన హిందీ రచ్చ మామూలుగా లేదు. ఇవాళ కూడా ట్రెండింగ్ టాపిక్ అయింది. ఒక సెక్షన్ హిందీ బ్రాహ్మణ భాష అంటుంది.. ఇంకొక సెక్షన్ ఉత్తరాది భాష అని హేళన చేస్తుంది.. ఇవాల్టికి దేశంలో బతకాలంటే హిందీ కొద్దో గొప్పో వచ్చి ఉండాలనే సోయి ఆ చెప్పే వాళ్లకు లేదు.. అక్కడి దాకా ఎందుకు హైదరాబాద్ లో హిందీ రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పల్సిన పని లేదు. సరే నిన్న జరిగిన విషయాన్ని ఒక్కో మీడియా హౌస్ ఒక్క విధంగా పబ్లిష్ చేసింది.. ఆఫ్ కోర్స్ ఈ విషయంలో ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డిని బాగా వెనకేసుకొచ్చింది. అతడు చంద్రబాబు క్యాంపు మనిషి. రాధాకృష్ణకు ఇష్టమైన మనిషి. కాబట్టి న్యూఢిల్లీ డేట్ లైన్ తో చక్కని వంటకం వండింది. ఈ మధ్య ఆంధ్రజ్యోతి మసాలా వార్తలు బాగా రాస్తున్నది కాబట్టి ఇందులోనూ మసాలా బాగా వేసింది. కానీ సేమ్ అదే ఈనాడు కు కెళ్తే వార్త విషయంలో పూర్తి న్యూట్రల్ గా ఉంది.. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… రేవంత్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి ” రేవంత్ హిందీ దుర్భరంగా ఉంది. అయినప్పటికీ తనను మాట్లాడనివ్వండి” అని లోక్ సభ స్పీకర్ ను కోరడం గమనార్హం.

అంతకుముందు ఏమైంది అంటే

నిన్న పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పుడు రూపాయి గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మోడీ పాలన విధానం బాగోలేదు. రూపాయి బాగా బక్క చిక్కిపోతోంది.. ఇప్పుడు ఐసీయూలో ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇదే సమయంలో కారణాలు తెలియదు గాని స్పీకర్ ఎందుకో బ్రేక్ వేశాడు.. దీంతో సహనం కోల్పోయిన రేవంత్ రెడ్డి ” మీరు నన్ను అడ్డుకోకూడదు” అంటూ స్పీకర్ కు దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో స్పీకర్ లోక్ సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి తో ” మీ సభ్యుడికి చెప్పండి అలా మాట్లాడకూడదని” సూచించాడు. దీనికి రంజన్ చౌదరి స్పందిస్తూ “రేవంత్ హిందీ అలానే ఉంటుంది… దయచేసి మాట్లాడనీయండి” అని కోరాడు.. స్పీకర్ కూడా సరే అన్నట్టుగా సైలెంట్ అయిపోయాడు.. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోయాడు. కానీ అక్కడ మొదట రేవంత్ రెడ్డి భాషను ప్రస్తావించింది కాంగ్రెస్ పక్ష నాయకుడు.. మరి ఈ లెక్కన చూస్తే రేవంత్ రెడ్డి భాషను కాంగ్రెస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్ హేళన చేశాడు అనుకోవచ్చా?

నిర్మల ఏమన్నారంటే

తర్వాత రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ” తెలంగాణ సభ్యులు తమ హిందీ బలహీనంగా ఉందని చెబుతున్నారు. నా హిందీ కూడా అలాంటిదే.. సో ఆ భాషలో నేను బదులిస్తాను” అంటూ ఆమె స్టైల్ లో సమాధానం చెప్పింది.. మరి ఆమె రేవంత్ రెడ్డి భాషను హేళన చేసింది ఎక్కడ? కానీ ఇక్కడ నేరుగా సమాధానం ఇవ్వకుండా సభ్యుడి భాషను ఆమె ప్రస్తావించడం క్షంతవ్యం కాదు.. వాస్తవానికి నిర్మల సీతారామన్ మోడీ క్యాబినెట్ లో పెద్ద విషయం ఉన్న మనిషి కాదు. పైగా ఆర్థిక శాఖ ఇవ్వడం మోడీ ఆలోచనా రాహిత్యం. ఆమె అడుగులు మోదీ ప్రభుత్వ విధానాలకు అనుగుణమే అయినప్పటికీ… ఎక్కడా మంచి ప్రసంగం, మంచి వ్యాఖ్య, మంచి సమర్థన ఉండవు.. ఒక రకంగా ఆమె బిజెపి కి పెద్ద మైనస్.. ఇక దేశం గురించి ఏం చెప్తాం?

రచ్చ రచ్చ ఎందుకు చేసినట్టు

ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొంచెం సైలెంట్ అయిపోతే బాగుండేది. హుందాగానూ ఉండేది. కానీ అనవసరంగా, ఆ సందర్భంగా కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు.. నేను శూద్రుడిని కాబట్టి ప్యూర్ హిందీ రాదు. మంత్రి బ్రాహ్మణవాది కాబట్టి ఆమెకు మంచి భాష రావచునన్నారు.. ఆ లెక్కన రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరో కూడా రేవంత్ రెడ్డి చెబితే బాగుండేది. శూద్రులకు హిందీ సరిగ్గా రాదా? బ్రాహ్మణులకు హిందీ బాగా వస్తుందా? ఇదెక్కడి సూత్రీకరణ? మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి తొందరపాటు తనుమే కనిపిస్తోంది. మరీ తెలంగాణ వీధిలో మాట్లాడినట్టు పార్లమెంట్లో మాట్లాడితే ఎలా కుదురుతుంది? శశి థరూర్ ను గాడిద అని సంబోధించినట్టు పార్లమెంట్ లో రంకెలు వేస్తే ఎలా చెల్లుబాటు అవుతుంది? వాస్తవానికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయిన వార్త వల్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీద ట్రోలింగ్ జరుగుతున్నది. అదేంటో గాని గులాబీ మీడియా కూడా దీన్ని బాగా పట్టుకుంది.. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే బిజెపిలో ఒక సెక్షన్ వారు కూడా ఆమెను తప్పు పడుతున్నారు. పాపం ఈ విషయమే మోడీకి అర్థం కావడం లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular