Rashmika Mandanna : ఒక ప్రక్క కెరీర్ జెట్ స్పీడులో పరుగెడుతుంటే వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. రెండు మూడు సందర్భాల్లో హీరోయిన్ రష్మిక మందాన చేసిన కామెంట్స్ ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఇటీవల రష్మిక కాంతార చిత్రం చూడలేదని చెప్పడం కన్నడిగులకు మరింత మండేలా చేసింది. కన్నడ చిత్ర గౌరవంగా భావిస్తున్న సినిమా కాంతార చూడలేదని రష్మిక చెప్పడం వాళ్లకు నచ్చలేదు. ఆమె సమాధానం లెక్కలేనితనంగా, అవమానించేలా ఉందని కన్నడ వర్గాల ఆరోపణ. రష్మిక కామెంట్స్ పై కాంతార హీరో రిషబ్ శెట్టి స్పందించారు. పరోక్షంగా ఆమెకు సెటైర్లు వేశారు.

రష్మికను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేస్తుదంటూ కథనాలు వెలువడ్డాయి. వివాదం పెద్దది చేయడం మంచిది కాదని భావించిన రష్మిక… కాంతార వివాదంపై మాట్లాడారు. మీడియా అడిగినప్పటికి నేను కాంతార మూవీ చూడలేదు. మూవీ చూసిన తర్వాత చిత్ర యూనిట్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపాను. ఇక్కడ ఎలాంటి వివాదం లేదు. కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేయబోతోందనే వార్తల్లో నిజం లేదని రష్మిక క్లారిటీ ఇచ్చారు.
అయితే కన్నడ వర్గాలు తనపై కోపంగా ఉన్నారనేది వాస్తవం. ఈ క్రమంలో సొంత ఊరికి వెళ్లేందుకు రష్మిక భయపడుతున్నారట. ఎప్పుడూ ముంబై లేదా హైదరాబాద్ లోనే ఉంటున్నారట. రష్మిక మంగుళూరుకి చెందిన అమ్మాయి కాగా… అక్కడకు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారట. కర్ణాటకలో తనపై దాడులు కూడా జరగొచ్చని రష్మిక భయమట. ఈ క్రమంలో రష్మిక మంగుళూరు వెళ్లి చాలా కాలం అవుతుందట. ఈ వివాదాలకు రష్మిక యాటిట్యూడ్ కూడా కారణం అవుతుంది. తెలుగు, హిందీ పరిశ్రమల్లో గుర్తింపు వచ్చాక ఆమె కన్నడ పరిశ్రమను చిన్నచూపు చూశారు .
నిజానికి హీరోయిన్ గా రష్మికకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది రిషబ్ శెట్టినే. 2016లో విడుదలైన కిరాక్ పార్టీ ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకుడు కాగా… రక్షిత్ శెట్టి, రష్మిక మందాన జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. కిరాక్ పార్టీ సెట్స్ లో రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. పెళ్ళికి సిద్దమై ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. పెళ్లి చేసుకుంటే సినిమా వదులుకోవాల్సి వస్తుందని రష్మిక మనసు మార్చుకున్నారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. అప్పుడు పెద్ద ఎత్తున రష్మిక ట్రోలింగ్ కి గురయ్యారు. రష్మికపై వ్యతిరేకతకు బీజం అక్కడే పడింది. ఆ సంఘటన తర్వాత ఆమె ఇతర పరిశ్రమల్లో ప్రయత్నాలు మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు.