Tummala Nageswara Rao : బిగ్ బ్రేకింగ్: తుమ్మల తో రేవంత్ రెడ్డి భేటీ, కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ

తుమ్మల ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో చేరి.. తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. 9 లేదా 11 తేదీల మధ్యన ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు.

Written By: Bhaskar, Updated On : August 31, 2023 10:12 pm
Follow us on

Tummala Nageswara Rao : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో సంచలన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం తుమ్మల నాగేశ్వరరావు ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్లు రవి కలవడం ఆ కోవలోనిదే. కొంతకాలంగా పాలేరు అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించకుండా.. కాంగ్రెస్ నుంచి గెలిచి, భారత రాష్ట్ర సమితిలో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి కి ఇవ్వడం పట్ల తుమ్మల నాగేశ్వరరావు ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. అప్పటినుంచి ఆయన అధిష్టానం మీద ఆగ్రహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల తన నివాసం నుంచి బయటకు వస్తూ ఉద్వేగానికి గురైన తుమ్మల నాగేశ్వరరావు.. అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని గొల్లగూడెంలో తన ఇంటికి సమీపంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక అప్పటినుంచి పాలేరు ముఖచిత్రం ఒకసారి గా మారిపోయింది.
కాంగ్రెస్ లో చేరిక
అయితే మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మల భావించారు. ఇందులో భాగంగా అంతర్గతంగా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు. ” పాలేరు అసెంబ్లీ స్థానం వరకు అంతర్గతంగా సహకారం అందిస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి” అనే ప్రశ్న వారి నుంచి తుమ్మలకు ఎదురైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రమంలోనే తన అనుచరులతో వరుస భేటీలు నిర్వహించిన తుమ్మల.. మనసు మార్చుకొని కాంగ్రెస్ లో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే గురువారం రేవంత్ రెడ్డి, జూనియర్ కాంగ్రెస్ నాయకులను వెంట పెట్టుకొని తుమ్మలను కలిశారు. తుమ్మలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ భేటీతో తుమ్మల పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
షర్మిల పరిస్థితి ఏంటి?
తాను కూడా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల పలుమార్లు ప్రకటించారు. ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు అదే విధమైన సంకేతాలు ఇచ్చారు. పాలేరు లో ఏకంగా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆమె పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం, ఆమె ఏపీలో కాంగ్రెస్ తరఫున పని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తుమ్మల ను రేవంత్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. షర్మిలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టవద్దని చెప్పిన రేవంత్.. ఆమె పాలేరులో పోటీ చేయకుండా ఉండేందుకు తుమ్మలను చాకచక్యంగా కలిసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణా మం నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారింది. కాగా, తుమ్మల ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో చేరి.. తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. 9 లేదా 11 తేదీల మధ్యన ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు.