Homeఎంటర్టైన్మెంట్Mallemala: మల్లెమాల పై తిరుగుబాటు ఆర్టిస్టుల ఆత్మగౌరవానికేనా ?

Mallemala: మల్లెమాల పై తిరుగుబాటు ఆర్టిస్టుల ఆత్మగౌరవానికేనా ?

Mallemala: మల్లెమాల “జబర్దస్త్” కామెడీకి అక్షయపాత్ర లాంటిది. నిత్యం కమెడియన్లను తయారు చేస్తూనే ఉంటుంది. “జబర్దస్త్”కి పోటీగా చాలా కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. అవన్నీ “జబర్దస్త్” ముందు నిలబడలేక మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయాయి. జ‌బ‌ర్ధ‌స్త్ షో మారుమూల‌న దాగి ఉన్న టాలెంట్ ను కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఎంతో మందికి కొత్త కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చింది. చాలా మంది సామాన్యులను నేడు సెల‌బ్రిటీలుగా మార్చింది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో రూపు మాత్రం వికారం పుట్టిస్తోంది. జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఎదిగిన వ్యక్తుల్లో ‘కిరాక్ ఆర్పీ’ కూడా ఒకడు. నెల్లూరు యాసతో కిరాక్ ఆర్పీ టీం మెంబర్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగాడు.

Mallemala
kiraak rp

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో నిర్మాణ సంస్థ ‘మల్లెమాల’ ‘నీఛం.. దరిద్రం’ అంటూ.. ఆ సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ‘మనసు లేని మనిషి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అసలు కిరాక్ ఆర్పీ ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే విందాం. ‘మల్లెమాల అనేది కేవలం ఒక పేరు మాత్రమే. అది ఎవరికీ దేవుడు కాదు. మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసేది పక్కా వ్యాపారం మాత్రమే. అసలు ఒక్క మాటలో ‘మల్లెమాల’ అనేది పెద్ద జైలు లాంటిది. కేజీఎఫ్ సినిమాలో బానిసలను ఎలా చూస్తారో.. మల్లెమాలలో కూడా మమ్మల్ని అలాగే చూస్తారు. జైలులో పెట్టే ఫుడ్ కంటే ‘మల్లెమాల’లో ఫుడ్ అధ్వాన్నంగా ఉంటుంది. చిప్ప కూడు పెడతారు. అన్నం, కూరలు, టిఫిన్లు అంత నీచంగా చాలా దారుణంగా ఉంటాయి.

Also Read: Koffee With Karan: కాఫీ విత్ కరణ్’షోలో ఫస్ట్ నైట్ సీక్రెట్స్ తో రచ్చ చేసిన రణవీర్, ఆలియా

పైగా ఆ ఫుడ్ కూడా అడుక్కుతినే వాడికి పెట్టినంత గౌరవంగా కూడా పెట్టరు. అసలు, సినీ ప్రపంచ చరిత్రలోనే మల్లెమాల వాళ్లు పెట్టేటంత వరస్ట్ ఫుడ్ ఎక్కడా పెట్టరు. మల్లెమాల లాగా ఇంతగా దిగజారిపోయిన ప్రొడక్షన్ కంపెనీ మరోటి ఉండదు’ అని కిర్రాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశాడు. ఒక్క ఆర్పీ మాత్రమే కాదు, జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ప్రతి కమెడియన్ ఇదే ఫీల్ అవుతున్నాడు. ఇదే విషయం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ‘జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో ఎవర్నైనా.. ‘వాళ్ల అమ్మ, నాన్న, బిడ్డలపై ప్రమాణం చేసి నిజం చెప్పమనండి’. వాళ్లంతా నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమే అంటారు. సుధీర్ మల్లెమాల లోనే తోపు. అలాంటి వ్యక్తికి కూడా సరైన గౌరవం లేదు. అందుకే.. అతను అక్కడ నుంచి బయటకు వచ్చేశాడు. అనసూయ పరిస్థితి ఇదే, రేపు మల్లెమాల నుంచి బయటకు రాబోయే అందరి పరిస్థితి కూడా ఇదే’ అని తన కామెంట్స్ పై ఆర్పీ వివరణ ఇచ్చాడు.

Mallemala
jabardasth

మల్లెమాల యాజమాన్యం అహంకారానికి, కమెడియన్ల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమే.. జబర్దస్త్ షో పై తిరుగుబాటు అని ఆర్టిస్ట్ లు చెబుతున్నారు. ఏ సంస్థలోనైనా వ్యక్తులు వెళ్తుంటారు వస్తుంటారు. ఎప్పటికీ వ్యవస్థ మాత్రమే శాశ్వతం. మల్లెమాలలో కూడా వ్యక్తులకు ప్రత్యేక గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ, ఆత్మగౌరవాన్ని కూడా బాధ పెట్టేలా ప్రవర్తించడం ఎవరికీ మంచిది కాదు. ఆర్పీ ఒక్కడే కాదు.. గతంలో షకలక శంకర్, ధనరాజ్, వేణు, ముక్కు అవినాష్, అప్పారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఇలాంటి కామెంట్లే చేశారు. అందుకే, ఆర్పీ మాటలను విమర్శలుగా మాత్రమే భావించలేం, తమ గౌరవానికి కలిగిన భంగపాటుగా, తమ ఆత్మగౌరవం కోసం మల్లెమాల పై చేసిన తిరుగుబాటుగా చూడొచ్చు. ఇప్పటికైనా మల్లెమాల సంస్థలో మార్పు రావాలని ఆశిద్దాం.

Also Read:Koffee with Karan 7: ‘ఊ అంటావా’లో సమంత కంటే.. టిప్ టాప్ లో కత్రినా బెటర్ డ్యాన్సర్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular