Renu Desai: బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకుంది. కానీ పవన్ మాత్రం మూడో పెళ్లి చేసుకుని రేణుదేశాయ్ ని పక్కన పెట్టేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అకీరా నందన్, ఆద్య. ఇక అప్పటి నుంచి పిల్లలే లోకంగా రేణు దేశాయ్ బతుకుతోంది. పవన్ కల్యాణ్ చేసిన దానికి మండిపడుతోంది. దీంతో అభిమానులు సైతం ఆమెపై ఫైర్ అయినా పవన్ చేసిన దానికి మీరైతే ఏం చేస్తారని ప్రశ్నించింది. ఒక ఆడదాన్ని ఇలా మధ్యలో వదిలేస్తారా? అని ఎదురు దాడి చేసింది. దీంతో వారు కిమ్మనకుండా ఉండిపోయారు.

ఇప్పటికి రేణుదేశాయ్ తన అభిమానులతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూంటుంది. పిల్లల విషయాలు ఎప్పటికప్పుడు నెట్టో పెడుతుంటుంది. దీంతో వారితో మాట్లాడుతుంటుంది. తనకు పిల్లలే సర్వస్వమని చెబుతుంటుంది. అందుకే వారి బాగోగుల కోసమే తాను ఒంటరిగా ఉంటున్నట్లు పోస్టులు పెడుతుంది. తనకు జరిగిన అన్యాయానికి కుమిలిపోతోంది. పవన్ కల్యాణ్ ఇలా చేస్తాడని అనుకోలేదని చాలా సార్లు బాధపడింది. తనను ఒంటరిగా వదిలేసి ఇంకోదానితో ఉండటాన్ని తప్పుబట్టింది.
Also Read: ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు
రేణుదేశాయ్ తన పిల్లలు చేసే పనులను ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. అకీరానందన్ మ్యూజిక్ సెన్స్, ఫుట్ బాల్ ఆటలో అతడు చూపిన నైపుణ్యాన్ని చూపిస్తుంది. మరోవైపు ఆద్య కూడా ఫొటోగ్రఫీలో చూపిస్తున్న ప్రతిభ గురించి చెబుతుంది. దీంతో అభిమానులు కూడా వారి ఫొటోలు చూసి సంతోషపడతారు. కరోనా సమయంలో వారి పట్ల జాగ్రత్తలు తీసుకుంది. కానీ మూడో వేవ్ లో ముగ్గురు కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకున్నారు. దీంతో వారి కోసమే రేణుదేశాయ్ నిత్యం భయపడుతూ ఉంటుంది.

అకీరా గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో వెకేషన్ కోసం స్కాట్లాండ్ వెళ్లారు. అక్కడి వాతావరణం చూసి స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ రేణుదేశాయ్ పోస్టులు పెట్టడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. స్కాట్లాండ్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడి పరిస్థితులు చూసి మురిసిపోతోంది. ప్రకృతి పారవశ్యానికి పరవశమైపోతోంది. ఎంత బాగుందో అని సంబరపడిపోతోంది. పిల్లలతో సందడిగా గడుపుతోంది. పవన్ కల్యాణ్ లేని లోటును ఇలా తీరుస్తోంది. పిల్లలను మంచి క్రమశిక్షణతో పెంచుతోంది.
Also Read:Koffee With Karan: కాఫీ విత్ కరణ్’షోలో ఫస్ట్ నైట్ సీక్రెట్స్ తో రచ్చ చేసిన రణవీర్, ఆలియా
[…] Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆనందానిక… […]