Men Google Search: ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోతోంది. దీంతో మంచికంటే చెడు ప్రభావాలే ఎక్కువగా కలుగుతున్నాయి. కరోనా పుణ్యమాని చిన్నపిల్లలకు కూడా మొబైల్ అలవాటు అయింది. దీంతో వారు ఫోన్ విడిచిపెట్టి ఉండటం లేదు. ఫలితంగా చదువుపై పెనుప్రభావమే చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయాన్ని గూగుల్ లో వెతుకుతూ తమ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటున్నారు. ఏ చిన్న అనుమానం కలిగినా గూగుల్ లో సెర్చ్ చేస్తూ నివృత్తి చేసుకుంటున్నారు. అన్నింటికి సర్వరోగ నివారణిలా ఇప్పుడు గూగుల్ మారిపోయింది. దీంతో పురుషులు ఎక్కువగా గూగుల్ ను ఆశ్రయిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కొందరిలో కొన్ని విషయాల పట్ల ఉత్సుకత ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలని ఆశతో చాలా మంది ఉంటారు. వారందరికి పరిష్కార మార్గాలు చూపించే వారధిగా గూగుల్ నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మగవారు ఎక్కువగా ఇష్టపడే విషయాలను గూగుల్ లో సెర్చ్ చేస్తూ తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. పురుషులు లైంగిక సామర్థ్యంపై ఎక్కువగా ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాము నపుంసకులా? కాదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ దాదాపు 68 వేల మంది పురుషులు గూగుల్ లో వెతుకున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.
Also Read: ETV Mallemala: డబ్బే కాదు…ఆర్టిస్టులకు అభిమనమూ ముఖ్యమే! అదిలేకే మల్లెమాల నుంచి వలసలు
యువకులైతే గడ్డం గురించి ఎక్కువగా వెతుకుతున్నారు. గడ్డం మందంగా రావానికి ఏ మందులు వాడాలి? ఎలా అయితే బాగుంటుందనే విషయాలపై ఎక్కువగా ఆరా తీస్తున్నారు. టీపీ ధరిస్తే వెంట్రుకలకు ఏదైనా ప్రమాదమా? జుట్టు ఊడిపోతుందా? బాడీ బిల్డింగ్ కోసం ఏం చేయాలి? వంటి ప్రశ్నలు గూగుల్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దేహానికి సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి తమ సందేహాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా కొందరైతే ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వస్తుంది కదా మరి మగవారిలో కూడా ఆ ప్రమాదం ఉందా? అని ఆలోచిస్తున్నారు. క్యాన్సర్ వల్ల చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పురుషుల్లో కూడా దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అమ్మాయిలను తృప్తిపరచడానికి ఏం చేయాలనే ప్రశ్నలు కూడా ఎక్కువగా అడుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో గూగుల్ తో పురుషులు తమకొచ్చిన అనుమానాలు తీర్చుకునేందుకు తపన పడుతున్నారనే విషయం అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ద్వారా అనేక విషయాలు తెలుసుకునే వెసులుబాటు కలిగిన సందర్భంలో అందరు గూగుల్ పైనే ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Mallemala: మల్లెమాల పై తిరుగుబాటు ఆర్టిస్టుల ఆత్మగౌరవానికేనా ?