The Warriorr Movie Review: నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా
దర్శకుడు: ఎన్.లింగుసామి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: నవీన్ నూలి
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నేడు వచ్చిన చిత్రం “ది వారియర్”. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..

కథ :
కర్నూలులో గురు (ఆది పినిశెట్టి) ఏమి చెబితే అది జరుగుతుంది. చంపి మొక్క నాటినా.. పోలీసులు కేసు పెట్టలేని దయనీయ పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి గురు రాజ్యంలోకి డాక్టర్ సత్య (రామ్) వస్తాడు. గురు దారుణాలకు అడ్డుగా నిలుస్తాడు. ఈ మధ్యలో సత్య ఎదురింట్లో ఉండే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి)తో ప్రేమలో పడతాడు. కానీ అంతలోనే గురు, సత్యను చావు దెబ్బ కొడతాడు. కానీ ఆ సత్య ఐపీఎస్ పాస్ అయ్యి వస్తాడు. అసలు సత్య పోలీస్ గా ఎలా మారాడు ? ఎందుకు మారాడు ? చివరకు గురును ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ.
Also Read: Mithali Raj: ఉఫ్.. హాట్ మిథాలి.. గ్లామర్ డోస్‌తో సెగలు రేపుతున్న మాజీ ఉమెన్ క్రికెటర్
విశ్లేషణ :
రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన పాత్రలో షేడ్స్ ను చాలా బాగా పలికించాడు. ఇంటర్వెల్ సీన్స్ లో మంచి ఎమోషనల్ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అండ్ మిగిలిన యాక్షన్ సీన్స్ లో కూడా రామ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక పాత్రలు, వాటి పరిచయం, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సాగుతూ.. సినిమా పై జోష్ పెంచాయి. కానీ ద్వితీయార్థంలో కథ మళ్లీ నెమ్మదిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ పండినా… ప్రతీ పాత్రకూ జస్ట్ జస్టిఫికేషన్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు.
పైగా దర్శకుడు లింగుస్వామి రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. అలాగే లవ్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.
కృతి శెట్టి తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది. అయితే సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. దర్శకుడు లింగుస్వామి బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
రామ్ నటన,
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం,
కొన్ని యాక్షన్ సీన్స్,
చివర్లో వచ్చే ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే రామ్ నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే కేవలం క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకే ఈ సినిమా నచ్చుతుంది. మిగిలిన వర్గాల వారికి ఈ చిత్రం కనెక్ట్ కాదు.
రేటింగ్ : 2.5 / 5
Also Read: Ram Gopal Varma Shiva Movie: శివ సినిమా కూడా కాపీయేనా? వర్మ సినిమా గురించి బయటకొచ్చిన లీక్
[…] Also Read: The Warriorr Movie Review: రివ్యూ : ది వారియర్ […]