Rajat Patidar: విరాట్ కోహ్లీ ని రీప్లేస్ చేసే ప్లేయర్ దొరికాడు..బిసిసిఐ అధికారిక ప్రకటన…

కోహ్లీ తన వ్యక్తిగత కారణాలవల్ల మొదటి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండలేనని బిసిసిఐ కి తెలియజేశాడు. దాంతో బిసిసిఐ కూడా అతని అభ్యర్థనను స్వీకరించి మొదటి రెండు మ్యాచ్ లు ఆడకుండా ఉండటానికి తనకి పర్మిషన్ ఇచ్చింది.

Written By: Gopi, Updated On : January 24, 2024 11:56 am
Follow us on

Rajat Patidar: ఇండియన్ టీం ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడటానికి రెడీ అవుతుంది. అందులో భాగంగానే ఈనెల 25 వ తేదీన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇక మొదటి మ్యాచ్ ని హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అలాగే రెండో మ్యాచ్ ని విశాఖపట్నం వేదికగా ఆడనున్నారు,ఇక మూడో మ్యాచ్ ని రాజ్ కోట్ వేదికగా, నాల్గోవ మ్యాచ్ ని రాంచీ వేదికగా, అలాగే ఐదో మ్యాచ్ ని హిమాచల్ ప్రదేశ్ లో ఆడనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లకి విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు అనే విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది.

అయితే కోహ్లీ తన వ్యక్తిగత కారణాలవల్ల మొదటి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండలేనని బిసిసిఐ కి తెలియజేశాడు. దాంతో బిసిసిఐ కూడా అతని అభ్యర్థనను స్వీకరించి మొదటి రెండు మ్యాచ్ లు ఆడకుండా ఉండటానికి తనకి పర్మిషన్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే వార్తలు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీని భర్తీ చేసే ప్లేయర్ దొరికాడు అంటూ బిసిసిఐ అధికారిక ప్రకటన చేసింది.

ఆయన ఎవరు అంటే మధ్యప్రదేశ్ కు చెందిన ‘రజిత్ పటిదారు’. ప్రస్తుతం పటిదార్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇండియన్ ఏ టీం తరఫున తన సేవలను అందిస్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ ల్లో రెండు సెంచరీ లు చేసి తన అద్భుతమైన ఫామ్ లో నిరూపించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో పటిదార్ ను టీమ్ లోకి తీసుకుంటూ బిసిసిఐ అధికారిక ప్రకటనలు జారీ చేసింది. విరాట్ కోహ్లీకి రీప్లేస్ మెంట్ గా చటేశ్వరా పూజార, అజంకే రహానే, సర్ఫా రాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ బిసిసిఐ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ ఈ యంగ్ ప్లేయర్ వైపు మొగ్గు చూపింది. ఇక మొదటి మ్యాచ్ 25 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఇండియన్ టీమ్ గెలిచి ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటుంది. ఇక ఈ రోజు పటిదార్ హైదరాబాద్ చేరుకొని టీమ్ మెంబర్స్ తో జాయిన్ అవుతాడు…