https://oktelugu.com/

బెగ్గర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రోజుకు రూ.215..!

  మనలో చాలామందికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత యాచకులు ఎక్కడో ఒకచోట తారసపడటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేర్వేరు కారణాల వల్ల కొంతమంది యాచకులుగా మారుతున్నారు. అయితే యాచకులుగా మారిన వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బెగ్గర్‌ఫ్రీ పేరుతో యాచకుల జీవితాలను మార్చడానికి రాజస్థాన్ సర్కార్ సిద్ధమవుతోంది. Also Read: గుండెపోటు వచ్చిన యజమానిని కాపాడిన కుక్క.. ఎలా అంటే..? టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 6, 2021 4:24 pm
    Follow us on

     

    మనలో చాలామందికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత యాచకులు ఎక్కడో ఒకచోట తారసపడటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేర్వేరు కారణాల వల్ల కొంతమంది యాచకులుగా మారుతున్నారు. అయితే యాచకులుగా మారిన వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. బెగ్గర్‌ఫ్రీ పేరుతో యాచకుల జీవితాలను మార్చడానికి రాజస్థాన్ సర్కార్ సిద్ధమవుతోంది.

    Also Read: గుండెపోటు వచ్చిన యజమానిని కాపాడిన కుక్క.. ఎలా అంటే..?

    టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, రాజ​స్తాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ‌ భాగస్వామ్యంతో రాజస్థాన్ సర్కార్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మొదట ఈ కార్యక్రమంలో భాగంగా 43 మంది యాచకులను ఎంపిక చేశారు. జైపూర్ కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యాచకులుగా జైపూర్ లో జీవిస్తున్న వారికి ప్రభుత్వం మొదట వసతి సదుపాయాలను కల్పించింది.

    Also Read: మోదీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.10తో రూ.1.6 లక్షలు మీ సొంతం..?

    మూడున్నర నెలల పాటు వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు రోజుకు 215 రూపాయల చొప్పున రాజస్థాన్ ప్రభుత్వం వారికి నగదును చెల్లిస్తుంది. శిక్షణలో భాగంగా ఆటలు ఆడించడం, యోగా నేర్పించడం, కంప్యూటర్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. రాజస్థాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నిరజ్‌ కుమామర్‌ పవన్‌ యాచకులను బాధ్యత గల పౌరులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు తెలిపారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    పోలీసుల సర్వే ఆధారంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. బ్యాచుల వారీగా శిక్షణ ఇస్తున్నామని నిరజ్‌ కుమామర్‌ పవన్‌ చెప్పారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని సమాచారం.