Rahul Gandhi: మోదీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలే అని వ్యాఖ్యానించి చివరకు రెండేళ్ల శిక్ష పడి లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు ఇచ్చి ఊరటతో అతని సభ్యత్వాన్ని పార్లమెంట్ పునరుద్ధరించింది. రెండు రోజులుగా సభకు హాజరవుతున్నారు. ఇప్పుడైనా బుద్ధిగా ఉంటాడని అందరూ అనుకున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీలు రాహుల్‌ను సుప్రీం కోర్టు నిర్దోషిగా ప్రకటించలేదని, స్టే మాత్రమే ఇచ్చిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాహుల్ తన కొంటె చేస్టలతో మరో వివాదంలో చిక్కుకున్నారు. మణిపూర్ ఘటనపై ఆయన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సభ నుంచి బయటకు వెళ్తూ మహిళా ఎంపీలకు కన్ను గీటారు. దీంతో బీజేపీ మహిళా ఎంపీలు మండిపడుతున్నారు.
చరిత్రలో ఇలా ఎన్నడూ జరుగలేదు..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘మహిళా సభ్యులందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి రాహుల్ వెళ్లిపోయారని.. ఇది ఓ సభ్యుడి దురుసుగా ప్రవర్తించడమేనని అన్నారు. అలాగే భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. రాహుల్ గాంధీ ఏంటి ఈ ప్రవర్తన అంటూ సభలో ఉన్న మహిళా ఎంపీలు రాహుల్‌పై ఫైర్ అయ్యారు. అలాగే.. సీసీటీవీ ఫుటేజీ తీసి ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశామని.. ఆధారాలు సేకరించి రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా ముందు తెలిపారు.
రాహుల్‌కు ఏమైంది..
బీజేపీ ఎంపి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ అసలు రాహుల్‌కు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. మహిళా ఎంపీలను చూసి కన్ను కొట్టాడని తెలిపారు. గౌరవ పదవిలో ఉండి ఇలా సంస్కార హీనంగా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపైనా ఆగ్రహం..
అంతకు ముందు అవిశ్వాసంపై మాట్లాడిన రాహుల్.. భారత మాత్రను మోదీ చంపేశారని, మణిపూర్ భారత దేశంలో లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ మణిపూర్ ముమ్మాటికీ భారత్‌లో భాగమే అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను ఉదహరించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rahuls flying kiss to bjps women mps in lok sabha is scandalous
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com