Nupur Chhabra: వెండితెరపై కనిపించాలన్న ఉత్సాహంతో చాలా మంది మోడల్ గా కెరీర్ ప్రారంభిస్తారు. ఈ తరుణంలో కొందరికి అడ్వర్టయిజ్మెంట్లలో నటించే అవకాశం వస్తుంది. ఈ ఛాన్స్ లను అస్సలు వదులుకోకుండా వాటిలో నటించి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లలో అలా ముందుగా ప్రకటనల్లో కనిపించిన వారే. అయితే కొందరు ఇలా ప్రకటనల ద్వారా పాపులర్ అయిన వారు అలాగే ఉండిపోతారు. సినిమాల్లోకి రావాలన్న కోరిక వారికి ఉండదు. మనం యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చూస్తూ నవ్వే అమ్మాయి కనిపిస్తుంది. ఆమెకు సంబంధించిన వీడియో ఉందని క్లిక్ చేస్తాం. కానీ అది ప్రకటన మాత్రమే. అయితే ఈ ప్రకటనలో కనిపించే అమ్మాయికి పెద్ద స్టోరీనే ఉంది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి.
సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ లో కనిపించే ఈ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. అమెరికాలో నివసిస్తున్న ఈమె ఇండియా సంతతికి చెందిన అమ్మాయే. మార్కెటింగ్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చేసిన ఈమె ప్రిన్సిపుల్ ఆఫ్ అకౌంటింగ్ లో పీజీ చేశారు. అలాగే బిజినెస్ ఎకనామిక్స్ కూడా చదివారు. ఆ తరువాత ఆమె చాబ్రా కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థను నడుపుతున్నారు. ఈక్రమంలో ఆమెకు ఫేస్ బుక్ యాడ్ లో నటించాలన్న ఆఫర్ వచ్చింది. దీంతో 6 సంవత్సరాల క్రితమే ఈ యాడ్ లోనటించారు.
ఫేస్బుక్ లో టెక్నికల్ రిక్రూటర్ గా, మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా ఫేస్ బుక్ లో పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆమె అందులో పనిచేయడం మానేశారు. ప్రస్తుతం ఆమె శాన్ ప్రాన్సిస్కోలో రా బ్లాక్స్ లో రీక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నారు. అంతేకాకుండా లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థను కూడా కో ఫౌండర్ గా ఉన్నారు.
ఈ సంస్థ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వారికి చేయూతనందిస్తున్నారు. 2020 కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతే ఈ సంస్థ నుంచి ఆదుకున్నారు. కానీ నుపుర్ సాహిల్ అనే వ్యక్తిని 17 అక్టోబర్ 2020లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల కిందట కనిపించిన ఆమెు పిక్ ప్రస్తుతం కనిపించడం లేదు.