Homeజాతీయ వార్తలుRahul Gandhi Disqualified: రాహుల్‌ అనర్హత : మన నేతలూ కళ్లు తెరవాలి.. మాట జారితే...

Rahul Gandhi Disqualified: రాహుల్‌ అనర్హత : మన నేతలూ కళ్లు తెరవాలి.. మాట జారితే పదవి ఊస్ట్‌!

Rahul Gandhi Disqualified
Rahul Gandhi Disqualified

Rahul Gandhi Disqualified: ప్రజాప్రతినిధులపై ప్రాజాప్రాతినిధ్య చట్టం కత్తి వేలాడుతోంది. ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్నట్లు మారాయి రాజకీయాలు. 2013 చట్టం రూపం పొందిన ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం పదవి కోల్పోయిన వారిలో రాహుల్‌గాంధీ మొదటి వాడేంద కాదు. గతంతో జయలలిత, లాలూప్రసాద్‌యాదవ్, రబ్రీదేవి తదితరులు కూడా పదవి కల్పోయారు. అయితే ఇప్పుడు ఇంతగా చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం రాహుల్‌ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కావడం, 130 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్య వహిస్తుండడం కారణం. చట్టం ఎవరికైనా ఒకే అన్నట్లు.. పార్లమెంటరీ సెక్రెటరీ రాహుల్‌కు సూరత్‌ కోర్టు శిక్ష విధించిన మరుసటి రోజే అనర్హత వేటు వేశారు. దీంతో ఇప్పుడ తెలుగు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

నోటికి ఎంతొస్తే అంత..
రాహుల్‌గాంధీ 2017లో కర్ణాక ఎన్నికల సమయంలో మోదీ పేరు ఉన్నవారంతా అవినీతి పరులు, దొంగలు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ మాత్రానికే ఓ బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. దీంతో 4 ఏళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. ఎన్నేళ్లు శిక్ష పడుతుందో అన్న చర్చ అటు తెలంగాణలో, ఇటు ఆధ్రప్రదేశ్‌లో జరుగుతోంది.

కేసీఆర్‌ భాషకు మొక్కాల్సిందే..
తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఇలాగే మాట్లాడుతాం అన్న సాకుతో పదవిని కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. రాజ్యాంగపదవిలో ఉండి కూడా పదవులకు కూడా గౌరవం ఇవ్వరు. ఆయన భాషకు, ఆయన నోటికే మొక్కాలి అన్నట్లుగా ఉంటుంది కేసీఆర్‌ భాష..

ఒంట పట్టించుకుంటున్న కేటీఆర్‌..
తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ కూడా ఇటీవల దుర్భాషలు ఆడడం అలవర్చుకుంటున్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష నెరవేరదేమో అన్న ఆందోళనలో కేటీఆర్‌ విపక్ష నేతలపై ఇష్టానుసారం మాట్లాడుతూర్నారు. అవులాగాళ్లు, చెప్పుతో కొడతా లాంటి పదాలు వాడుతున్నారు.

ప్రతిపక్ష నేతలూ అంతే..
ఇక తెలంగాణలో ప్రతిపక్ష నేతలు కూడా తామేం తక్కువ తిన్నాం అన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ చీఫ్‌ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇటీవల నోటిదురుసు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిలపై ఇటీవల తెలంగాణలో దాడులు కూడా జరిగాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. వాడు, వీడు అని సంబోధించడంతోపాటు, తమ నోటికి ఎంత వస్తే అంత మాట అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

Rahul Gandhi Disqualified
Rahul Gandhi Disqualified

ఆంధ్రా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తామేం తక్కువ తిన్నాం అన్నట్లు మాట్లాడుతున్నారు. బూతు పదాల వాడకంలో ఏపీలో ముందువరుసలో ఉంటారు కొడాలి నాని. ఆయన విపక్ష నేతలపై నోరు తెరిస్తే ప్రతీ పదం బూతే. ‘వాడు’ నుంచి మొదలు కుని వాడమ్మ మొగుడు, లుచ్చా.. లఫంగ, ఎదవ నాయాలా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వాడే పదాలన్నీ బూతే. కొడాలి నాని తర్వాత పేర్ని నాని, రోజా కూడా దుర్భాషలాడడంలో తామేం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే ఘోరంగా మాట్లాడుతున్నారు. జగన్‌ కూడా విపక్షాలతోపాటు మీడియానూ ఏకిపారేస్తున్నారు.

టీడీపీలోనూ..
టీడీపీ నేతలు కూడా తమేం తక్కువ కాదన్నట్లు బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. టీడీపీ నేత అచ్చెంనాయడు, పట్టాభి, వంగల అనిత, పయ్యావుల కేశవ్, సోమిరెడి చంద్రమోహన్‌రెడ్డితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేశ్‌ కూడా నోటిదురుసు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు కూడా పద ప్రయోగంలో పట్టు తప్పుతున్నారు.

మాట తుళ్లితే.. వేటే..
రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడే విషయంలో ఇకపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మాట తుళ్లినా వేటు మాత్రం తప్పదు అనిపిస్తోంది. ఇందుకు తాజాగా రాహుల్‌గాంధీ ఉదంతమే ఉదాహరణ. ప్రజాప్రాతినిధ్య చట్టం కత్తి.. చట్టసభల్లో ప్రతీ ప్రజాప్రతినిధిపై వేలాడుతోంది. ఇకపై ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదు. ముఖ్యమంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండకపోతే పదవీ గండం మాత్రం తప్పదు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular