
Meena Second Marriage: ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్త నమ్మాలో? ఏది నమ్మొద్దో తెలియని పరిస్థితి ఎదురైంది. కొన్ని వాస్తవాలు అని నమ్మేస్థితికి వచ్చే సిరికి అవి ఫేక్ అవుతున్నాయి. ఫేక్ అనుకునే సరికి రియల్ అవుతున్నాయి. కొందరు పనిగట్టుకొని అసత్య వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా నటులపై లేని పోని పుకార్లు సృష్టించి తమ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటి హేమ ఓ సోషల్ మీడియా తన గురించి తప్పుగా వార్తలు ప్రచారం చేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. ఇక లేటేస్టుగా నటి మీనా గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది.
గ్లామర్ హీరోయిన్ మీనా గురించి ఇటీవల వార్తలు వరుసబెట్టి వస్తున్నాయి. ఆమె భర్త మరణించినప్పటి నుంచి ఆమె గురించి రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. లేటేస్టుగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు హీటెక్కిస్తున్నాయి. తల్లిదండ్రులు, కూతురు ఒత్తిడి మేరకు తనకంటే వయసులో చిన్న వాడైన ఓ యంగ్ హీరోను మీనా పెళ్లి చేసుకుంటుందని, నిశ్చితార్థం కూడా జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై మీనా స్పందించారు. ఆమె రియాక్షన్ ఎలాగుందంటే?
తన పెళ్లి వార్తలపై మీనా ఫైర్ అయ్యారు. తన భర్త చనిపోయిన దు:ఖంలో ఉంటుండగా తనపై ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వారిని విడిచిపెట్టేది లేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని అన్నారు. ఇక ఆమె క్లోజ్ ఫ్రెండ్ మీడియాతో మాట్లాడుతూ మీనా ఎలాంటి వివాహం చేసుకోవడం లేదని, అలా చేసి ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు. ఈ వార్తలన్నీ అవాస్తవమని ఆమె పేర్కొన్నారు.

ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా కొనసాగిన మీనా తన పెళ్లి తరువాత సినిమాలు మానేసింది. కొన్ని సంవత్సరాల కిందట సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సైడ్ రోల్ లో నటించింది. లేటేస్టుగా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ‘ఆర్గానిక్ మామా.. హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మీనాకు అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఈ తరుణంలో మీనాపై వార్తలు రావడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు.