Raghurama va Vijaya sai: తగ్గేదేలే.. ఇద్దరూ వైసీపీ ఎంపీలే.. కానీ అందులో ఒకరు జగన్ ను ఎదురించి రెబల్ గా మారారు. మరొకరు జగన్ నమ్మిన బంటు.. వీరిద్దరూ ఒకే దాని కోసం ఫైట్ చేస్తున్నారు. అది జగన్ సర్కార్ పైనే.. ఒకరు పాజిటివ్ గా.. మరొకరు నెగెటివ్ గా.. ఎప్పుడూ వాదులాడుకోని వీరిద్దరూ ఫస్ట్ టైం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విమర్శలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు.

ఏపీలో వైసీపీ తరుఫున గెలిచి ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకొని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించిన ట్వీట్ వార్ రచ్చ రంబోలా అయ్యింది. అసలే నాక్కొంచెం తిక్కుంది.. దానికి లెక్కే లేదు అనుకునే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎవరైనా తిట్టినా.. తిట్టకున్నా విరుచుకుపడే రకం.. అలాంటి విజయసాయిరెడ్డి తిడితే ఊరుకుంటాడా? కడిగిపారేశాడు. విజయసాయి కోడిపందేలతో పోల్చి రఘురామను తిడితే.. ‘కోడికత్తి’ని బయటకు తీసి సాయిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చాడు రఘురామ.. వీరిద్దరి ట్వీట్ వార్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయ్యింది. నెటిజన్లకు కన్నుల పండువగా మారింది.
ఇద్దరు ఉద్దండ పిండాలు తిట్టుకుంటుంటే చూసే నెటిజన్లు పండుగ చేసుకున్నారు. ఇది కదా తిట్లు, దెప్పిపొడవలు.. ఒకరి పరువు మరొకరు తీసుకోవడాలు అని వీటిని తెగ షేర్లు చేస్తూ కనిపించారు.
ఈ ట్వీట్ వార్ ను విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ‘‘కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే.’’ అంటూ గట్టి పదాలతో విరుచుకుపడ్డారు.
దీనికి రఘురామ అంతే ధీటుగా బదులిచ్చాడు. ‘‘కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా?’’ అంటూ రఘురామ కడిగిపారేశారు. రికార్డింగ్ డ్యాన్సర్ల వలే ఇద్దరూ సోషల్ మీడియాలో పడి పరువు తీసుకున్నారు.
కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? https://t.co/2u9qvFMIBH
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) January 24, 2022