sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి త్వరలో అప్ డేట్ రానుందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. చంద్రబోస్ రాసిన ఈ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట.

ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నారని ఈ మధ్య కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఈ రీషూట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పటివరకు రీషూట్ చేసిన సీన్ ఒక్కటి కూడా లేదని.. ఇవన్నీ కేవలం పుకార్లే అంటూ చిత్రబృందంలోని సభ్యుడు చెబుతున్నాడు. ఇక, ఈ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: రైలులో లగేజీని మర్చిపోయారా..? తిరిగి పొందాలంటే ఇలా చేయండి!
మహేష్ ప్రస్తుతం కరోనాతో ఈ సినిమా షూటింగ్ కి దూరంగా ఉంటున్నాడు. మహేష్ కి కరోనా తగ్గాక, ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ముందుగా ఒక సాంగ్ ను షూట్ స్టార్ట్ చేస్తారట. కాగా ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: తక్కువ ఖర్చుతో ఆరోగ్యం పొందాలా ? ఐతే ఈ పండు తినండి !