Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప: ది రూల్’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన పలు ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా రాజమౌళి రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టేస్తుంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బాహుబలి 2 లైఫ్ టైం రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశం మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. నదిలో ఎత్తచందనం ని లారీలలో ఎక్కించుకొని ఛేజ్ చేస్తున్న సన్నివేశం మేకింగ్ చూస్తుంటే పుష్ప లోని యాక్షన్ సన్నివేశాలు ఒక పక్కకి కూడా సరిపోవు అనే విషయం అర్థం అవుతుంది. ఈ మేకింగ్ వీడియో లో అల్లు అర్జున్ కనపడలేదు కానీ, పోలీస్ జీప్ మాత్రం కనిపించింది.
అంటే ఈ సన్నివేశం ‘భన్వర్ సింగ్ షికావత్’ అలియాస్ ఫహద్ ఫాజిల్ మీద తెరకెక్కిస్తున్నారు అనే విషయం అర్థం అయ్యింది. ఈ ఏడాదిలోనే ఎలా అయినా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి జనవరి 12 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ సంక్రాంతి మిస్ అయితే, సమ్మర్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.
https://www.youtube.com/watch?v=7dRY7KFv5ms&t=1s