Homeజాతీయ వార్తలుYogi Adhityanath's Rule : బుల్డోజర్, బుల్లెట్: యూపీలో యోగి పాలనపై ఎంత మోదమో.. అంత...

Yogi Adhityanath’s Rule : బుల్డోజర్, బుల్లెట్: యూపీలో యోగి పాలనపై ఎంత మోదమో.. అంత ఖేదం

Yogi Adhityanath’s Rule : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆరేళ్ల కాలంలో 183 మంది క్రిమినల్స్‌ హతమయ్యారు. ఇందులో 10,900 ఎన్‌కౌంటర్లు జరిగాయి. 23వేలకు పైగా అరెస్టులు చోటు చేసుకున్నాయి. వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. ఆయా ఎన్‌కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అనుచరులు కాన్పూర్‌లో చేసిన దాడిలోనే చనిపోయారు. ఇదంతా ఒక కోణం మాత్రమే. మరి ఈ బుల్డోజర్,బుల్లెట్ తరహా న్యాయాన్ని ఎంతమంది సమర్థిస్తున్నారు? ఎంతమంది విమర్శిస్తున్నారు? ఒకసారి పరిశీలించి చూస్తే..

యోగి ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాలు తగ్గించామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. తుపాకీ వినియోగించి చేసే నేరాల సంఖ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిలకడగా పెరుగుతోంది. “ఆర్మ్స్ యాక్ట్ 1959” ప్రకారం నమోదయ్యే నేరాల సంఖ్య ఉత్తరప్రదేశ్లో ప్రతి లక్షమంది జనాభాకు 15.7 గా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. రాష్ట్రంలో ఒక 2021 లోనే ఈ తరహా కేసులు 36,363 నమోదయ్యాయి. ఇక గ్యాంగ్ వార్ హత్యలు ఉత్తర ప్రదేశ్ లో పెరిగాయి. 2021లో గ్యాంగ్ వార్ కారణంగా హత్య చేసినట్టు అంగీకరించిన కేసులు 65 నమోదయ్యాయి. లో 42 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇటువంటి కేసుల సంఖ్య 2017లో దేశవ్యాప్తంగా 74 నమోదైతే అందులో ఉత్తర ప్రదేశ్ లో 27 జరిగాయి.. అపహరణల వంటి నేరాల సంఖ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయి.. జాతీయ సగటు 7 కు పైగా ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 6.3 శాతంగా ఉంది. 2016_18 కాలంలో ఇక్కడి కిడ్నాప్ లు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదయ్యాయి.

అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. 2016లో ప్రతి లక్ష మంది జనాభాలో ఇటువంటి నేరాలు 30 నమోదయ్యాయి. వాటి సంఖ్య 2021 నాటికి 22.7 కు చేరుకుంది. 2021లో ఈ నేరాల సంఖ్య జాతీయ సగటు 30.2 గా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. యోగి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు పదోన్నతి కోసం ఓ సబ్ ఇన్స్పెక్టర్ నోయిడాలో ఓ జిమ్ ట్రైనర్ పై కాల్పులు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ లో పోలీసులు రైడ్ పేరిట గోరక్ పూర్ లోని హోటల్ పై దాడి చేశారు. మనిష్ గుప్తా అనే వ్యాపారిని అతని కుటుంబం ఎదుటే తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో అతడి కుటుంబ సభ్యులు పోలీసులపై ధైర్యంగా పోరాడు కేసులు నమోదు చేయించారు. దీంతో యోగి ప్రభుత్వం ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్కౌంటర్ అనేది రెండువైపులా పదును కత్తి వంటిది. దాన్ని ఇష్టానుసారంగా వాడితే ఒక్కో సారి దీనికి పురిగొల్పిన వారే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది.

గతంలో మహారాష్ట్ర ప్రాంతంలో అండర్ వరల్డ్ రాజ్యమేలేది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్కౌంటర్లను మార్గంగా ఎంచుకుంది. ఫలితంగా దయానాయక్, ప్రదీప్ శర్మ, విజయ్ సాలస్కర్, సచిన్ వాజే, రవీంద్రనాథ్ వంటి అధికారులు పాపులర్ అయ్యారు. ఇందులో సచిన్ వాజే అనే అధికారి తన పాపులారిటీ ఉపయోగించుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఏకంగా ముఖేష్ అంబానీనే బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. దీనికి తోడు అతడు అధికారంలో వారికి చీకటి కార్యకలాపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. చివరికి జైలు పాలై పోలీస్ శాఖ పరువు తీశాడు. అయితే పోలీసులకు తిరుగులేని అధికారాలు ఇస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గత సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం యూపీలో ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version