Ram Mandir: కఠిన దీక్షలో ప్రధాని మోదీ.. జగదభి రాముడి ప్రాణ ప్రతిష్టకు అనుష్టానం!

ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దీంతో మోదీ ఇందుకు సమాయత్తం అవుతున్నారు. అనుష్టాన దీక్ష చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : January 20, 2024 11:48 am

Ram Mandir

Follow us on

Ram Mandir: ఆయన మన దేశ ప్రధాని.. చుట్టూ పదుల సంఖ్యలో సేవకులు, అధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. చిటికేస్తే క్షణాల్లో ఆయనకు కావాల్సింది కళ్ల ముందు ఉంటుంది. కానీ, ఆయన అపర రామ భక్తుడు. అభినవ రామదాసు. అందుకే గొప్ప సంకల్పంతో భారతీయుల 500 ఏళ్ల కలను నెరవేర్చబోతున్నారు. అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం పూర్తి చేసి జనవరి 22న అభిజిత్‌ లగ్న సుమహూర్తంలో మధ్యాహ్నం 12:29:08 సెకన్లకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈమేరకు ఆధ్యాత్మిక నగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అనువనువూ ఆధ్యాత్మికత, రామ నామం స్పురించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జనవరి 15 నుంచే అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రాణ ప్రతిష్ట చేయబోయే బాల రాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. గర్భాలయంలో ప్రవేశపెట్టి ప్రతిష్టించారు. అయితే, బాల రాముడి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ప్రధాని మోదీ అనుష్టానం చేస్తున్నారు.

కఠిన నేలే పట్టు పరుపు.. కొబ్బరి నీళ్లే అన్న పానీయాలు..
ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దీంతో మోదీ ఇందుకు సమాయత్తం అవుతున్నారు. అనుష్టాన దీక్ష చేస్తున్నారు. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు 11 రోజులపాటు అనుష్టానం చేస్తానని మోదీ గతంలోనే ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రస్తుతం దీక్షలో ఉన్నారు. దీక్షలో భాగంగా ఆయన కఠిన నేలపై నిద్రిస్తున్నారు. కొబ్బరినీళ్లనే అన్నపానీయాలుగా స్వీకరిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా రామనామ స్మరణలో నిమగ్నమవుతున్నారు. ఆలయాలను సందర్శిస్తూ పూజలు, భజనల్లో పాల్గొంటున్నారు. ఇక దీక్షలో భాగంగా ప్రధాని మోదీ కఠిన నియమాలను పాటించడంతోపాటు పూర్తిగా రాముని మార్గం అనుసరిస్తున్నారు.

21న అయోధ్యకు ప్రధాని..
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ జనవరి 21 సాయంత్రం అయోధ్యకు చేరుకోనున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన అక్కడి రంగనాథస్వామి ఆలయంతోపాటు పలు పురాతన ఆలయాలను సందర్శించనున్నారు. భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం అయోధ్యకు చేరుకుని సోమవారం వేకువజామున సరయు నదిలో స్నానమాచరిస్తారు. అనంతరం అనుమాన్‌ గర్హి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రామ భక్త హనుమాన్‌ అనుమతి తీసుకుని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.