Pre-Wedding Party: మారుతున్న కాలంతోపాటే పెళ్లి తంతూ మారుతోంది. ఒకప్పుడు పెళ్లి అంటే 16 రోజుల పండుగ అంటా.. మారిన జీవన విధానంతో దానిని ఐదు రోజులకు కుదించారు. ప్రస్తుతం ఈ ఐదు రోజుల పెళ్లే కొనసాగుతోంది. అయితే పెళ్లి తంతుకు ఆధునికతను జోడిస్తున్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటామని ఖర్చుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం నుంచి శోభనం వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసే ఏజెన్సీలు వచ్చేశాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పెళ్లి చేసుకునే వధూవరులు తమకు నచ్చిన లొకేషన్లలో వీడియో షూట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం తమకు అందుబాటులో ఉన్న అందమైన లొకేషన్లు ఎంపిక చేసుకుంటున్నారు. కొంతమంది సంపన్నులు పెద్దపెద్ద నగరాలకు వెళ్లి గ్రాండ్‌గా ప్రీవెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడో జంట చేసుకున్న ప్రీవెడ్డింగ్ షూట్ చూస్తే వ్యాక్ అనడం ఖాయం.. అంతేకాదు వాంతులు కూడా వచ్చేసాయి. అంత రోతగా ఉంది.

మురికి కాలువలో షూటింగ్..
చాలా మంది వధూ వరులకు ప్రీ వెడ్డింగ్ లొకేషన్లను ఫొటో, వీడియో గ్రాఫర్లే సజెస్ట్ చేస్తారు. అయితే పుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. వెరైటీ పేరుతో నేటితరం ఆలోచనలు వెర్రి వేషాలు వేస్తున్నాయి. ఎవరేమనుకుంటే మనకేంటి అని కొంతమంది స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ‘మా ప్రీవెడ్డింగ్ షూట్.. మా ఇష్టం’ అన్నట్లుగా గతంలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మురికి గుంత ఎంపిక చేసుకుంది. అందులో వధూవరులిద్దరూ దొర్లుతూ డ్రెయినేజీలో లొకేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేశారు. ఆ ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ జంట కూడా ప్రీవెడ్డింగ్ షూట్ స్పాట్‌గా మురికి కాలువను ఎంపిక చేసుకుంది.
డ్రెయినేజీలో రొమాన్స్..
మురికి కాలువను ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్‌గా ఎంపిక చేసుకున్న ఆ జంట ఫొటో, వీడియో గ్రాఫర్లను తీసుకుని లొకేషన్‌కు వెళ్లింది. వాళ్లు ఆ లోకేషన్ చూసి ఆశ్చర్య పోయారు. లొకేషన్ ఏదైతే తమకేంటి.. తమకు డబ్బులు వస్తే చాలు అనుకుని.. ముక్కు, మూతికి మాస్కులు పెట్టుకుని షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఇక కాబోయే జంట కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని డ్రెయినేజీలో దిగి రొమాన్స్ చేసింది. ఈ దృశ్యాలను వీడియో, ఫొటో గ్రాఫర్లు చిత్రీకరించారు. ఇప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెసేజ్ ఓరియంట్ అని..
అయితే రోత పుట్టిస్తున్న ఈ ఫొటో షూట్ వెనుక మేస్సేజ్ ఉందని కొంతమంది అంటున్నారు. లేకుంటే ఇలా ఎందుకు చేస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు జీవరాశికి ముప్పుగా పరిణమిస్తున్నాయని, ప్లాస్టిక్‌ను అవైడ్ చేయాలని సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని ఇలా డ్రెయినేజీలో ప్రీవెడ్డింగ్ షూట్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్లాస్టిక్‌ను అవాయిడ్ చేయకపోతే భవిష్యత్‌లో మన బతుకులు మురికి కూపం అవుతాయి అనే సందేశం ఇచ్చేందకు ఇలా చేసి ఉంటారని పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరూ.. ఒక్కో కామెంట్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రెయినేజీ ప్రీవెడ్డింగ్ షూట్ ఫొటోలను చూసిన నెటిజన్లు తీరొక్క కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడా ప్లేస్ దొరకలేదా అనిక కొంతమంది. మనుషులా పందులా అని.. ఎలా భరించార్రా ఆ కంపుని.. మీ ఓపికకు దండాలు.. ఎక్కడ నుంచి వచ్చార్రా మీరు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు..
ఈ జంట ఫొటో షూట్ వెనుక ఆంతర్యం ఏముందు ఆ జంట చెబితేనే అందరికీ తెలుస్తుంది. నెటిజన్స్ కామెంట్స్‌కు వాళ్లు స్పందిస్తారో లేదో మరి!