HomeతెలంగాణNizam's wealth : వైరల్ వీడియో: నిజాం గుప్తనిధుల చుట్టూ 11 అడుగుల నాగు: అది...

Nizam’s wealth : వైరల్ వీడియో: నిజాం గుప్తనిధుల చుట్టూ 11 అడుగుల నాగు: అది చూసి యువకుల పరార్

Nizam’s wealth : ఇన్నాళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు నిజాం ప్రభువు వని తెలుసు. ఆయనకు చెందిన విలువైన ఆభరణాలు ప్రభుత్వం సొంతంమయ్యాయని తెలుసు. కానీ ఆ నిజాం ప్రభువు గుప్తనిధులు కూడా దాచాడని, వాటిని ఒక సొరంగంలో భద్రపరిచాడని ఎంతమందికి తెలుసు? పైగా ఆ నిధులు ఎవరూ దోచేయకుండా ఒక నాగబంధాన్ని కాపలాపెట్టాడని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఈ విషయం రాజేంద్రనగర్ కు చెందిన కొందరు యువకుల ద్వారా వెలుగులోకి వచ్చింది.

రాజేంద్రనగర్ యువకుల ద్వారా..

రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు అత్తాపూర్ ముసాబ్ మహల్ కు వెళ్లారు. అది పురాతనమైన నిజాం కాలం నాటి భవనం. సరైన నిర్వహణ లేకపోవడంతో కొద్ది మేర మరమ్మతులకు గురైంది. కానీ అప్పట్లో దాని నిర్మాణానికి డంగు సున్నం వాడటంతో చెక్కుచెదరకుండా ఉంది. అయితే ఆ భవంతిలో గుప్తనిధులు ఉన్నాయని కొంతమంది యువకులకు తెలిసింది. దీంతో వారు వాటి తవ్వకాల కోసం ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారికి అనుకోని రీతిలో ఒక సొరంగం కనిపించడంతో నేరుగా వెళ్లారు.. అయితే అక్కడ అనుకోని దృశ్యం వారి వొళ్ళు జలదరించేలా చేసింది. ఆ సొరంగం చివరి ప్రాంతంలో 11 అడుగుల నాగుపాము పడగవిప్పి కనిపించింది. దీంతో ఆ యువకులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడటం తో హాట్ టాపిక్ అయింది.

ఇది నిజమేనా

ఆ యువకులు చెప్పిన మాటలతో కొంతమంది అందులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజాం కాలం నాటి నిధులకు నాగబంధం ఉండటంతో మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు.. సాధారణంగా ముస్లింలు హిందూ సంప్రదాయాలను పెద్దగా నమ్మరు. కానీ నిజాం కాలం నాడు అప్పటి ఆభరణాలకు నాగబంధం కలిపారు అంటే ఏదో జరిగి ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి గుప్త నిధులు ఉన్నాయనే వదంతులు వ్యాపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 నిజాం గుప్త నిధులకే కాదు..  అనంతపద్మనాభస్వామి సన్నిధిలోనూ.. 

కేవలం నిజాం కాలం నాటి గుప్తనిధులకు మాత్రమే కాదు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి నేల మాలిగలకు కూడా నాగబంధం ఉందని తెలుస్తోంది. ఆ మధ్య అనంత పద్మనాభ స్వామి నేల మాలిగలు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే వాటికి నాగబంధం ఉందని తెలియడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే నాటి కాలం నాటి నిధులను ఎవరూ దోచుకోకుండా ఉండేందుకు నాగ బంధాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే మరికొందరు అలాంటిది ఏమీ ఉండదని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత సాంకేతిక కాలంలో ఇలాంటి వాటికి చోటు లేదని స్పష్టం చేస్తున్నారు. గుప్తనిధులకు నాగబంధాలు ఎలా ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజేంద్రనగర్ యువకులకు అంతటి సొరంగంలో నాగుపాము కనిపించడం, వారు భయంతో వెనక్కి రావడం.. చూస్తుంటే కార్తికేయ సినిమాలాగా కనిపిస్తోంది. అయితే ఈ భవనం లో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే అనేక విషయాలు వస్తాయని అక్కడి స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular