Prabhas : ‘ఖాన్’ త్రయానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రభాస్…

మొత్తానికైతే నార్త్ వాళ్ళకి సరైన హీరో ప్రభాస్ రూపంలో దొరికాడు వాళ్ల అరాచకానికి అడ్డుకట్ట వేసేది ప్రభాస్ మాత్రమే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు

Written By: NARESH, Updated On : January 1, 2024 9:27 am
Follow us on

Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా చేసిన సలార్ సినిమా ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా వసూళ్ల సునామిని సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా 600 కోట్ల కలక్షన్స్ ను రాబట్టి టాప్ టెన్ వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాల్లో వన్ ఆఫ్ ది మూవీ గా నిలిచి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు ప్రభాస్ సలార్ సినిమాతో చుక్కలు చూపిస్తున్నడనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు వేరే సౌత్ హీరోలకి సాధ్యం కానీ రేంజ్ లో ప్రభాస్ మొదటి రోజే 75 కోట్ల భారీ ఓపెనింగ్ కలక్షన్లను రాబట్టి ఖాన్ త్రయానికి సాధ్యం కానీ ఒక భారీ ఓపెనింగ్స్ ని సెట్ చేసి పెట్టాడు. ఇక ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా తీశాడో అప్పట్నుంచి సౌత్ సినిమా రేంజ్ అనేది మారిపోయింది.

ఎప్పుడు నార్త్ సినిమాలే గొప్ప అని చెప్పుకునే ఖాన్ త్రయానికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా సలార్ సాలిడ్ హిట్ తో పాటు బాలీవుడ్ మాఫియా కి కూడా ముచ్చేమటలు పట్టిస్తుంది. ఇక ఇది అంతా చూసిన సౌత్ సినిమా జనాలు నార్త్ సినిమా హీరోలకి సరైన మొగుడు ప్రభాస్ అంటూ భారీ ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ప్రభాస్ సలార్ తో పాటు రిలీజ్ అయిన డంకీ సినిమా మంచి పేరు తెచ్చుకోవడంతో నార్త్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది.ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా రోజుకి 10 నుంచి 15 కోట్ల కలక్షన్లను రాబడుతూ బాలీవుడ్ లో 100 కోట్లకు పైన కలక్షన్లు రాబట్టిన ఒక సౌత్ సినిమాగా కూడా గుర్తింపు పొందింది.

మొత్తానికైతే నార్త్ వాళ్ళకి సరైన హీరో ప్రభాస్ రూపంలో దొరికాడు వాళ్ల అరాచకానికి అడ్డుకట్ట వేసేది ప్రభాస్ మాత్రమే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ తర్వాత చేస్తున్న సినిమాలతో కూడా భారీ హిట్లు వస్తాయి అంటూ అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు…