జనసేనాని కీలక అడుగులు వేశాడు. అందరికీ షాకిచ్చాడు. ఈ దసరా నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దానికి బలమైన కారణం.. ముందుగా పార్టీని బలోపేతం చేయడం.. అందుకే నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాతే బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర వాయిదా వెనుక బలమైన కారణమే ఉందని అనిపిస్తోంది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడే ప్రజల్లోకి వెళితే ఆ ఇంపాక్ట్, ప్రభావం ఉండదని.. చివరి ఎన్నికల సంవత్సరం ప్రజల్లో ఉంటేనే ఆ ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వేడిలోనే ప్రజల్లోకి వెళ్లి.. వారి అభిమానం చూరగొని గెలవాలని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అందరూ భావిస్తున్నట్టు ఈ దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టడం లేదని బాంబు పేల్చారు. అక్టోబర్ 5న దసరాకు బస్ యాత్ర చేయటం లేదని.. మరి కొద్ది రోజులు ఆగిన తరువాత యాత్ర భారీగా, అఖండంగా యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ నుంచి నియోజకవర్గాల వారీగా మంగళగిరి కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు.
ముందుగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి సమావేశం మొదలుపెట్టనున్నట్టు పవన్ తెలిపారు. 2024 లో జరగబోవు సాధారణ ఎన్నికలలో వైసిపి కి ఫైనల్ గా 45 – 67 సీట్లు మాత్రమే వస్తాయని సంచలన నిజాలు బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని… బలమైన పోరాటం చేయగలిగి విజయం సాధించాలన్న తపన, తృష్ణ, లక్ష్యం ఉన్న అభ్యర్థులే ఈసారి ఎన్నికల బరిలో ఉంటారని సీట్ల కేటాయింపుపై కీలక ప్రకటన చేశారు. నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది రాజకీయాలలోకి రావటమేనని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవేర్చని వారికి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందన్నారు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
2014లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చానో కూడా పవన్ కళ్యాణ్ అసలు నిజాన్ని బయటపెట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు ఉంటాయని ఆలోచించి..అనుభవం గల చంద్రబాబు అయితేనే సమస్యలు తీర్చగలడని టీడీపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. నాడు అమరావతికి ఒప్పుకొని నేడు 3 రాజధానులు అంటున్న జగన్ కు..చట్టాలు అమలు చేసే అధికారం ఎక్కడిది? అని ప్రశ్నించారు. అందుకే వైసీపీని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.