వైరల్ వీడియో: పుష్ప సినిమా పాట లీక్.. అల్లు అర్జున్ డ్యాన్స్ అదుర్స్

వరుస మూవీలతో ఇండస్ట్రీని షేక్ చేసిన జంట అల్లు అర్జున్-సుకుమార్ లది. వారిద్దరూ ఆర్య, ఆర్య2 పేరుతో తీసిన మూవీలు రికార్డులు తిరగరాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో మరోసారి సుకుమార్ తో కలిసి పనిచేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తుండగా.. సుకుమార్ వెరైటీ మాస్ కథను తీర్చిదిద్దాడని అంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పోస్టర్ గూస్ బాంబ్స్ తెప్పించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ప్రస్తుతం […]

Written By: NARESH, Updated On : February 2, 2021 6:45 pm
Follow us on

వరుస మూవీలతో ఇండస్ట్రీని షేక్ చేసిన జంట అల్లు అర్జున్-సుకుమార్ లది. వారిద్దరూ ఆర్య, ఆర్య2 పేరుతో తీసిన మూవీలు రికార్డులు తిరగరాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో మరోసారి సుకుమార్ తో కలిసి పనిచేస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తుండగా.. సుకుమార్ వెరైటీ మాస్ కథను తీర్చిదిద్దాడని అంటున్నారు.

తాజాగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పోస్టర్ గూస్ బాంబ్స్ తెప్పించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని మోతుగూడెంలో చిత్రీకరణ జరుగుతోంది.

తాజాగా సినిమాకు సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ వేస్తున్నట్టు కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల వైకుంఠపురంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బన్నీ ఇప్పుడు ఈ ‘పుష్ప’ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా విడుదలైన వీడియో వైరల్ అవుతోంది.