Pawan Vizag Toor: జనసేనాని పవన్ కళ్యాణ్ క్రేజ్ కు వైసీపీ సర్కార్ భయపడింది. ఆయన వస్తే విమానాశ్రయం అభిమానులతో నిండిపోవడానికి కంగారుపడింది. పవన్ తిడుతూ ఎయిర్ పోర్టుకు వచ్చిన వైసీపీ మంత్రులపైనే దాడి చేసిన జనసేన అభిమాన సంద్రాన్ని చూసి బెంబేలెత్తింది. అందుకే పవన్ కు ఆ క్రేజ్ దక్కకుండా చేయడం కూడా పోలీసులను ప్రయోగించింది.

పవన్ కళ్యాణ్ ‘జనవాణి’ పేరిట ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు విశాఖ పర్యటనకు వచ్చారు. అయితే ఆయన పర్యటనకు ఆశేష ప్రజానీకం తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ కూడా అమరావతి వద్దు.. విశాఖ రాజధాని కోసం వైజాగ్ లో పంచాయితీ పెట్టింది. టీడీపీ కూడా వైసీపీ తీరుపై సభ పెట్టింది. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు విశాఖ కేంద్రంగా సమరానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కు ఆ క్రేజ్ దక్కకుండా ఆయన పర్యటనను వైసీపీ సర్కార్ పోలీసుల చేత అడుగడుగునా అడ్డుకుంది.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో పోలీసులు అతిగా ప్రవర్తించారు.
ప్రజలు పవన్ కళ్యాణ్ ని చూడనీయకుండా ఆటంకాలు సృష్టించారు. పవన్ పర్యటనను కవర్ చేస్తున్న మీడియా వాహనాన్ని ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. ఆయన పర్యటనను కవరేజ్ దక్కకుండా పోలీసులు కుట్ర చేశారు. ఆయనను టీవీలో చూడకుండా పోలీసులు అడ్డుకున్న తీరుపై దుమారం రేపింది.

పవన్ కళ్యాణ్ విషయంలో డీసీపీ సుమిత్ గరుడ ఓవర్ యాక్షన్ చేసిన తీరు చూసి జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వాహనంపైకి ఎక్కి ప్రజలకు ఆయనను కనిపించకుండా అతిగా ప్రవర్తించాడు. ఒక ఐపీఎస్ అయ్యిండి అధికార పార్టీకి అమ్ముడుపోయాడని జనసైనికులు విమర్శించారు. ఎంత ప్రభుత్వ అధికారి అయితే ఇలా ప్రతిపక్షాలను తొక్కేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు వ్యవహార శైలిని జనసేన శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నారు.