PM Modi Unveils National Emblem: అశోకుడు రోడ్డు వెంబడి చెట్లు నాటించెను అని చరిత్రలో చదివాం.ఆయన పాలనలోని స్వర్ణయుగానికి గుర్తుగా ‘నాలుగు సింహాలను’ చెక్కించాడు. దాన్నే మనం జాతీయ చిహ్నంగా పెట్టుకున్నాం. భారత ప్రభుత్వ జాతీయ చిహ్నంలో నాలుగు సింహాలుంటాయి. కానీ ఎటువైపు నుంచి చూసినా మూడు మాత్రమే కనిపిస్తాయి. ఆసింహాలు సైలెంట్ గా ఉంటాయి. కానీ మన ప్రధాని మోడీ సార్ పాలనలో చెక్కించిన సింహాలు మాత్రం వైలెంట్ గా ఉన్నాయి. అంతా మోడీ సార్ ఘనత మరీ.

జాతీయ చిహ్నంపై సింహాలు గర్జిస్తున్నాయి. అవును మీరు చదివింది నిజమే. జాతీయ చిహ్నంపై సింహాలు తీక్షణంగా చూస్తూ మౌనంగా ఉంటాయి. కానీ ఇటీవల కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటుచేసిన జాతీయ చిహ్నంపై మాత్రం సింహాలు గర్జిస్తూ కనిపిస్తున్నాయి. మోడీ సర్కార్ జాతీయ చిహ్నంలో చేసిన మార్పుపై రకరకాల కామెంట్స్ వినిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో స్పీకరే సుప్రీం. కానీ ప్రధాని మోదీయే ఈ కొత్త జాతీయ చిహ్నాలను ఆవిష్కరించడం వివాదాస్పదమైంది. పెద్ద దుమారమే రేగుతోంది. అయితే ఏకంగా జాతీయ చిహ్నం మారిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. విమర్శలకు తావిస్తోంది. పాత జాతీయ చిహ్నంలో సింహాలు సాధారణంగా మౌనంగా కనిపిస్తాయి. కానీ మోదీ ఆవిష్కరించిన చిహ్నంలో మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సింహాలు గర్జిస్తూ కనిపిస్తుండడంతో దూమారం ప్రారంభమైంది. ఇది ఎటు దారితీస్తుందోనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Also Read: Target TRS: టార్గెట్ టీఆర్‌ఎస్.. ఆ నలుగురి ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు!
-సుదీర్ఘ చరిత్ర..
భారత జాతీయ చిహ్నానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. చిన్నప్పటి నుంచి మన ఆ మూడు సింహాలను చూస్తుంటాం. అదో మైండ్ లో ఇట్టే ఫిక్సయిపోయింది. నాలుగు సింహాలు, కింద అశోకచక్రం ఉన్న గుర్తును జాతీయ చిహ్నంగా గుర్తించుకుంటాం. అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇట్టే పోల్చేస్తారు.మరి పార్లమెంట్ పై ఏర్పాటుచేసిన చిహ్నం గుర్తులు కావాలని మార్పు చేశారో.. లేకుంటే యాదృశ్చికంగా జరిగిందో కానీ.. స్పష్టమైన మార్పు అయితే మాత్రం గమనిస్తోంది. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చరిత్రనే మార్చేస్తారా? అంటూ నెటిజెన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై అటు కేంద్ర ప్రభుత్వం కానీ.. నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేంద్ర శాఖలేవీ నోరు మెదపడం లేదు. వివాదం ముదరక ముందే దీనిపై ఒక స్పష్టతనివ్వాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

-స్పందించని కేంద్రం..
ఇంత దుమారం రేగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్న చిన్న మార్పులు చేశామనో.. లేకుంటే తెలియకుండా తప్పు జరిగిందనో ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉన్నా.. కేంద్ర మాత్రం పట్టించుకోవడం లేదు. అటు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు విస్తరిస్తున్నాయి. అవి ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన మాత్రం అంతటా ఉంది. అటు పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ కానీ.. చరిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను పరిరక్షించే కీలక శాఖలేవీ ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కావాలనే తాత్సారం చేస్తే మాత్రం మూల్యం చెల్లించుకున్నట్టే. ఏకంగా భారతదేశ పాలన నిర్ణయాలను వేదికగా ఉన్న పార్లమెంట్ పై చిహ్నాన్ని ఏర్పాటుచేశారు కనుక కేంద్ర ప్రభుత్వమే దీనిపై స్పష్టమైన ప్రకటన జారీచేస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకపోతే మాత్రం గర్జించే సింహలే మన చిహ్నంగా భావితరాలు గుర్తించుకునే అవకాశముంది. అయితే కేంద్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకుంటుందా? లేదా ? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. సాంకేతిక కారణాలను సాకుగాచూపి చిహ్నాన్ని మార్చేందుకే మొగ్గుచూపుతుందన్న టాక్ అయితే నడుస్తోంది.
-ఇంకా పనులు పెండింగ్..
జాతీయ చిహ్నాన్ని ఎంతో ఆకర్షణీయంగా తయారుచేశారు. 9,500 కిలోల బరువుతో..6.5 మీటర్ల ఎత్తులో రూపొందించిన కాంస్య చిహ్నం భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.కొన్ని నెలల పాటు సీనియర్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం నిపుణులు దీన్ని తీర్చదిద్దారు. దీనికి సపోర్టుగా 6,500 కిలోల బరువు ఉన్న సపోర్ట్ స్టీల్ స్ట్రక్చర్ ను నియమించనున్నట్టు ప్రకటించారు. అయితే పనులయితే మిగిలి ఉన్న నేపథ్యంలో జాతీయ చిహ్నంలో మార్పులు చేస్తారో? లేదో చూడాలి.
Also Read:KCR Vs Eatela: కేసీఆర్ పై ఈటల పోటీ.. అసలు కారణం ఇదేనా..?