Revanth Reddy : భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చారు. మహారాష్ట్రలోని నాగపూర్‌మీదుగా సోమవారం(మార్చి 4న) ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత సభలో పాల్గొన్నారు.
వేదికపై సీఎం, గవర్నర్..
ఈ సభా వేదికపై మోదీకి ఇరువైపులా గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి కూర్చున్నారు. గవర్నర్ మోదీకి కుడిపక్కన కూర్చోగా రేవంత్ ఎడమవైపు కూర్చున్నారు. ఈ సందర్భంగా మోదీ సీఎం రేవంత్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ, రేవంత్ ఏం మాట్లాడుకున్నారు అన్న చర్చ జరుగుతోంది.
కేంద్రంతో సఖ్యతగా..
ప్రధాని నరేంద్రమోదీ గతంలో రాష్ట్రానికి నాలుగుసార్లు వచ్చారు. కానీ ఒక్కసారి కూడా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ వెళ్లలేదు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రొటోకాల్ పాటిస్తూ మోదీకి స్వాగతం పలికారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీతో రేవంత్‌రెడ్డి మాట్లాడి ఉంటారని పేర్కొంటున్నారు. సభా వేదికపై సీఎం మాట్లాడుతూ కూడా ఎన్నికల వరకే విమర్శలని, ఎన్నికల తర్వాత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రాత్రి రాజ్‌భవన్‌లో బస…
ఇక సభ అనంతరం మోదీ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణ పర్యటన తర్వాత ఒడిశాకు వెళ్తారు. కాగా, రెండు రోజుల పర్యటనలో మోదీ రాష్ట్రంలో రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
LIVE: PM Modi inaugurates, dedicates & lays foundation stone of projects in Adilabad, Telangana https://t.co/UIYWqzEI7v
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 4, 2024