Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. ఆయన చేయని పాత్ర లేదు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్… పాత్ర ఏదైనా కానీ పరకాయ ప్రవేశం చేస్తాడు. కోట శ్రీనివాసరావులో మరో ప్రత్యేకత మాండలికం ఏదైనా చాలా ఖచ్చితంగా మాట్లాడతారు. తెలంగాణా, గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు.. ప్రతి యాసను ఆయన అవపోసన పట్టారు. నాటక రంగం నుండి చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు అడుగుపెట్టాడు.
ఆహా నా పెళ్ళంటా, మామగారు చిత్రాల్లో కోట నటన నభూతో నభవిష్యతి. వెయ్యికి పైగా చిత్రాల్లో కోట నటించారు. అలాంటి నటుడిని ఓ స్టార్ హీరో అందరి ముందు అవమానించాడట. సదరు హీరో ఎవరో కాదు బాలకృష్ణ అట. ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను ఓ మూవీ షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళాను. బాలకృష్ణ సైతం ఆయన మూవీ షూటింగ్ కొరకు అక్కడకు వచ్చారు. రాజమండ్రి హోటల్ లో నేను లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. కొందరు దూరంగా ఉండి, నాకు సైగలు చేస్తున్నారు. తప్పుకో తప్పుకో అంటున్నారు.
నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే బాలకృష్ణ వస్తున్నారు. నేను చూసి మర్యాదపూర్వకంగా నమస్కారం బాబు గారు.. అని అన్నాను. ఆయన కాండ్రించి నా మీద ఉమ్మి వేశాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏం చేస్తాం. సీఎం కొడుకు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అన్నీ సర్దుకున్నాయి. కలిసి సినిమాలు చేశాం.. అని వెల్లడించారు. మరి బాలయ్యకు కోట శ్రీనివాసరావు మీద అంత కోపం ఎందుకు వచ్చిందనేది తెలియదు.
అయితే బాలయ్య మూడ్ గురించి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ చాలాసార్లు వివాదాస్పదం అయ్యింది. ప్రేమగా దగ్గరకు వచ్చిన అభిమానులను బాలకృష్ణ కొట్టిన సందర్భాలు అనేకం. సెట్స్ లో అసిస్టెంట్స్ పై కూడా ఆయన చేయి చేసుకుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అసిస్టెంట్ డైరెక్టర్ ని కొట్టబోతే ఆపానని దర్శకుడు కే ఎస్ రవికుమార్ ఓ సందర్భంలో తెలియజేశారు.
ఇటీవల హీరోయిన్ అంజలి పట్ల బాలకృష్ణ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ హీరోయిన్ అంజలిని వేదికపై వెనక్కి నెట్టాడు. ఈ ఘటన నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. సింగర్ చిన్మయి వంటి ఫెమినిస్ట్స్ బాలయ్య తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బాలయ్యలో మంచి గుణం ఉంది. అదే సమయంలో ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేము,
Web Title: Star hero who insulted kota srinivasa rao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com