Peddha Kapu – 1 Teaser : కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో స్టార్ డైరెక్టర్ రేసులోకి వచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. బ్రహ్మోత్సవం ఆయన ఇమేజ్ భారీగా డామేజ్ చేసింది. ఆ సినిమా దెబ్బకు చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన అసురన్ రీమేక్ నారప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు. అది డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాలకు ఒరిగిందేమీ లేదు. కాగా ఆయన సంచలన ప్రాజెక్ట్ ప్రకటించారు.
పెదకాపు టైటిల్ తో మూవీ అనగానే పరిశ్రమ దృష్టి పడింది. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానున్న క్రమంలో పెదకాపు 1 అంటూ పోస్టర్స్ వదిలారు. నేడు చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈసారి ఆయన విలేజ్ పాలిటిక్స్ ఎంచుకున్నారు. ఊరిని శాసిస్తున్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఆధిపత్య పోరు. దాంతో నలిగిపోయే జనాల బ్రతుకులు. ఆ ఇద్దరి అధికారానికి గండి కొట్టి కొత్త జెండా ఎత్తేవాడే హీరో.
టీజర్ ఆసక్తి రేపింది. విజువల్స్ బాగున్నాయి. ఒకటిన్నర నిమిషానికి పైగా ఉన్న టీజర్ సీరియస్ గా సాగింది. అనసూయ కీలక రోల్ చేయడం విశేషం. రావు రమేష్, తనికెళ్ళ భరణి, నాగబాబు కథలో కీలకంగా కనిపిస్తున్నారు. విరాట్ కర్ణ అనే యువకుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సైతం నటించడం విశేషం.
పెదకాపు టీజర్ రంగస్థలం మూవీని తలపిస్తుంది. విలేజ్ పాలిటిక్స్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ఫార్ములా. 70-80లలో ఈ తరహా కథలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ మధ్యకాలంలో రంగస్థలం మరలా ఆ ట్రెండ్ గుర్తు చేసింది. ఇటీవల విడుదలైన దసరా సైతం విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగుతుంది. మరి పెదకాపు ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. అఖండ మేకర్స్ నిర్మిస్తున్నారు.
