ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులతో పాటు ఇతరులకు కూడా అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు టికెట్ బుకింగ్ ద్వారా మాత్రమే రైలు ప్రయాణికులకు సుపరిచితమైన ఐఆర్సీటీసీ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐముద్రా అనే యాప్ ద్వారా ఐఆర్సీటీసీ ఈ సర్వీసులను అందిస్తోంది. ఐముద్రా యాప్ ద్వారా అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి.
Also Read: చినిగిపోయిన రూ.2000, రూ.500 నోట్లు ఉన్నాయా.. ఎలా మార్చుకోవాలంటే..?
ఫిజికల్ లేదా డిజిటల్ కార్డు రూపంలో ఈ సర్వీసులను పొందవచ్చు. ఎవరైతే ఐముద్రా వీసా కార్డులు తీసుకుంటారో వారికి 2 వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. కనీసం 5 వేల రూపాయల మొత్తం ఖర్చు చేసిన వాళ్లు 2 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందేందుకు అర్హులవుతారు. ఐఆర్సీటీసీ ట్విట్టర్ ద్వారా ఐఆర్‌సీటీసీ ఐముద్రా వీసా లేదా రూపే కార్డుకు సంబంధించి క్యాష్ బ్యాక్ ఆఫర్ వివరాల గురించి వెల్లడించింది.
Also Read: వాహనధారులకు షాకింగ్ న్యూస్.. ఆ తప్పు చేస్తే భారీ జరిమానా..?
ఐముద్ర యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సైన్ అప్ కావడం ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఐముద్రా కార్డును కలిగి ఉన్నవాళ్లు బిల్లుల చెల్లింపులతో పాటు ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం, మనీ ట్రాన్స్‌ఫర్, షాపింగ్ చేయవచ్చు. ఐముద్రా కార్డుల కొరకు ఐఆర్‌సీటీసీ ఫెడరల్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికుల కొరకు క్యాటరింగ్ సర్వీసులను కూడా అందిస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
https://www.ecatering.irctc.co.in/ వెబ్ సైట్ లేదా ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ సహాయంతో ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. దేశంలోని 500 రెస్టారెంట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, ఇతర వివరాలు ఇచ్చి ఫుడ్ సులభంగా ఆర్డర్ చేయవచ్చు.