Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి మొండిగా వెళతారు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. వారి సమస్యలపై అంతే పౌరుషంగా ప్రశ్నిస్తారు. అసలు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు.. తనకు రాజ్యాధికారం కన్నా ప్రజల సమస్యలు తీర్చడమే ముఖ్యమని ప్రకటించిన ధీశాలి పవన్. సమకాలీన రాజకీయాల్లో డబ్బే ప్రధానంగా సాగుతున్న నేతలకు పవన్ కళ్యాన్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

కౌలు రైతుల కోసం తన సొంత డబ్బు రూ.5 కోట్లకు పైగా వెచ్చించిన మానవతామూర్తి పవన్ కళ్యాణ్. తన కొచ్చే సంపాదన కేవలం సమాజసేవకు మాత్రమే వినియోగిస్తానని.. తనకు ఆడంబరాలు అవసరం లేదని వినమ్రంగా చెప్పుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి గొప్ప నేత మన పవన్ కళ్యాణ్..
Also Read: Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్
అందుకే పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ప్రాణమిచ్చే అభిమానులున్నారు. ఆయన చూపు చూస్తే చాలు రాష్ట్రమంతా ప్రజాసమస్యలపై కొట్లాడే జనసైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ లోని ఆ నిత్య స్ఫూర్తి.. తెగింపు.. వీరోచిత పోరాటం చూస్తే ‘క్యూబా’ విప్లవ వీరుడు ‘చేగువేరా’ గుర్తుకు రాక మానరు.అందుకే భారత చేగువేరాగా పవన్ కళ్యాణ్ అభివర్ణిస్తుంటారు. అంతటి ఉద్వేగ మనస్తత్వం పవన్ కళ్యాణ్ సొంతం.

తాజాగా చాలా రోజులుగా ట్విట్టర్ లో గుబురు గడ్డంతో ఒక యోగిలా కనిపించిన పవన్ కళ్యాణ్ ఫొటో ఈరోజు మాయమైంది. ఆయన తన ఫొటోను అప్డేట్ చేశాడు. అదే ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ సభలో ప్రసంగిస్తూ ప్రజల వైపు తీక్షణంగా చూస్తూ పెదవులు మలిపెట్టి పౌరుషంతో చూసిన ఆ చూపు ఎవరినైనా ఫిదా చేయకమానదు.. అచ్చం ‘చేగువేరా’ను తలపించేలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ లోని నీతి నిజాయితీ.. పౌరుషానికి ఈ ఫొటో తార్కాణంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఈ ఫొటోను అప్డేట్ చేయగానే దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారింది. తెలుగు నాటే కాదు.. కర్ణాటక, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఫొటోను షేర్ చేస్తూ టాప్ ట్రెండ్ లోకి తీసుకెళ్లారు. ఆ ఫొటో చూస్తేనే గూస్ బాంబ్స్ వచ్చేలా ఉంది. పవన్ ఫ్యాన్స్ ఆ ఫొటోను షేర్లు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read:BJP- Rajya Sabha: ఆ నలుగురికి రాజ్యసభ ఎంపికతో బీజేపీకి లాభం ఏంటి?
Recommended Videos
[…] […]
[…] […]
[…] […]