Pawan Kalyan Vs BJP: ఒక వ్యక్తిని ఎప్పుడు గౌరవిస్తారంటే అతడు ఆర్థికంగా.. సామాజికంగా బలంగా ఉన్నప్పుడు. ఇక రాజకీయాల్లో గౌరవం ఎలా దక్కుతుందంటే.. ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం చూరగొని ఎన్నికల్లో గెలిచినప్పుడు.. భర్త లేని వితంతువును.. పదవిలో లేని రాజకీయ నాయకుడిని ఎవరూ గుర్తించరు. అదే సమాజ లక్షణం.

ఇక పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో పర్యటన సందర్భంగా ఓ మాట అన్నారు. అభిమానులు ‘సీఎం అంటూ కేకలు వేస్తుంటే..’ వారికి హితవు పలికారు. సీఎం అని అనడం కాదని.. ఓట్లేసి గెలిపించి నిజంగానే గెలిపించాలని.. సీఎంను చేయాలనే.. అప్పుడే ఈ అరుపులకు సార్థకత అని.. అంతవరకూ తనను సీఎం అని అనొద్దని అభిమానులకు కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు.
ఇన్నాళ్లు పొత్తులో ఉన్న బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ను అలానే చూసింది. ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పోటీచేయడానికి కూడా ఇన్నాళ్లు సంకోచించారు. అందుకే పవన్ కళ్యాణ్ తమ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా గుర్తించేందుకు బీజేపీ పెద్దలు తటపటాయించారు.
ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడేమో కానీ.. తాజాగా బీజేపీకి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఒంటరిగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి రెడీ అయ్యారు. పొత్తులో బీజేపీ ఉన్నా కూడా దాన్ని పక్కనపెట్టి మరీ సొంతంగా అక్టోబర్ 5 నుంచి ఏపీలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో పవన్ బీజేపీని కలుపుకుపోకుండా ఒక్కడే నిర్వహిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే బీజేపీకి గట్టి షాక్ లా ఉందనే చర్చ సాగుతోంది. వచ్చే ఏడాది ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ కు క్షేత్రస్థాయిలో బలం లేదని బీజేపీ, టీడీపీలు అనుకుంటున్నాయి. అందుకే ఆ బలాన్ని పెంపొందించడం.. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల ఆదరాభిమానలు చూరగొని 2024 ఎన్నికల్లో బలంగా జనసేనను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. సీఎం క్యాండిడేట్ గా ప్రకటించని బీజేపీకి షాకిచ్చేలా పవన్ ఈ యాత్ర చేపట్టారు. ప్రజల్లో బలంతోనే పార్టీలు తన కాళ్లదగ్గరకు వచ్చే ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
జనంలోకి పాదయాత్రలు, బస్సుయాత్రల్లో వెళ్లిన ఏ నేత కూడా ఎన్నికల్లో ఓడిపోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే పనిచేస్తున్నారు. బలం లేదని పవన్ కల్యాణ్ ను ‘సీఎం క్యాండిడేట్’గా ప్రకటించడానికి బీజేపీ ఇప్పటికే తటపటాయిస్తోంది. టీడీపీ పొత్తుకు ముందుకు రావడం లేదు. అందుకే ఆ బలాన్ని పెంచుకోవడానికే పవన్ కళ్యాణ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యర్థులే తన కాళ్ల వద్దకు వచ్చేలా ఈ భారీ ప్లాన్ చేశారు. మరి ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.