
Janasena 10th Anniversary : జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమోషనల్ గా మాట్లాడారు. 10 ఏళ్ల తన రాజకీయ పార్టీ ప్రస్థానం ముందుగా గుర్తు చేసుకున్నాడు. తాను పార్టీ పెట్టినప్పుడు కేవలం ఒక్కడినే అని.. అప్పుడు ఎవరూ లేరని పవన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులకు ఆరాధ్యుడిగా ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తనకు 1000 కోట్ల ఆఫర్ ను కేసీఆర్ ఇచ్చాడని ఒక పత్రికాధినేత ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సంచలన కౌంటర్ ఇచ్చాడు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. అసలు డబ్బుపై తనకు వ్యామోహం లేదని.. రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తిని తాను అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
తాను 22 రోజులు ఒక సినిమా కోసం కాల్షీట్లు ఇచ్చానని.. దాని కోసం తనకు రోజుకు 2 కోట్ల చొప్పున పారితోషికం ఇస్తున్నారని.. అలాంటి రేంజ్ నాది అని.. 1000 కోట్లకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
తన రేంజ్, తన పరపతి.. తన ఆదాయం అంతగా ఉంటే ఇలా 1000 కోట్లు తీసుకునే ఖర్మ నాకు లేదంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యర్థులకు తనపై విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చారు.