Bigg Boss 6 Telugu Finale- Srihan Revanth: బిగ్ బాస్ సీజన్ 6 కి ఇద్దరు విన్నర్స్ అని చెప్పొచ్చు. ఫినాలే అలా ముగిసింది మరి. ప్రేక్షకులు గెలిపించిన శ్రీహాన్ రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నాడు. చివరి వరకు ఆత్మవిశ్వాసం చూపించిన రేవంత్ విన్నర్ గా టైటిల్ అందుకున్నాడు. విచిత్రంగా శ్రీహాన్-రేవంత్ గెలుచుకున్న ప్రైజ్ మనీ సమానం. శ్రీహాన్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలతో పాటు లెన్స్ కార్ట్ వారి రూ. 5 లక్షలు గెలుపొందారు. అంటే మొత్తం రూ. 45 లక్షలు. ఇక రేవంత్ ప్రైజ్ మనీ రూ. 10 లక్షలతో పాటు రూ. 35 లక్షలు విలువైన ఫ్లాట్, చేసుకున్నాడు. అలా రేవంత్ కి ప్రైజ్ మనీగా లభించింది రూ. 45 లక్షలు.

అయితే ఈ ప్రైజ్ మనీలో వాళ్లకు దక్కేది చాలా తక్కువే. ప్రైజ్ మనీలో భారీగా టాక్స్ కటింగ్స్ ఉంటాయి. ఆదాయ పన్ను చట్టాల ప్రకారం.. లాటరీ, గేమ్ షోస్, రియాలిటీ షోస్ లో గెలుచుకున్న స్థిర, చర ఆస్తులపై 30.9% టాక్స్ వసూలు చేస్తారు. కాబట్టి శ్రీహాన్ తాను పొందిన రూ. 45 లక్షల నుండి రూ. 13.9 లక్షలు తిరిగి చెల్లించాలి. అవి పోగా మిగిలేది రూ. 31.09 లక్షలు.
ఇక రేవంత్ క్యాష్ రూపంలో రూ. 10 లక్షలు తీసుకున్నాడు. రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 10 లక్షల విలువైన కారు గెలుచుకున్నాడు. వీటిపై రూ. 13.9 లక్షల టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రైజ్ రూపంలో వచ్చే మొత్తాన్ని ప్రభుత్వాలు సాధారణ ఆదాయంగా పరిగణించవు. అందుకే భారీ టాక్స్ వసూలు చేస్తారు. అయితే శ్రీహాన్-రేవంత్ లకు కటింగ్స్ పోనూ మిగిలిన రూ. 31.09లతో పాటు 15 వారాలు హౌస్లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ అదనంగా వస్తుంది.

వారిద్దరి రెమ్యూనరేషన్ పరిగణలోకి తీసుకుంటే తక్కువలో తక్కువ రూ. 50-60 లక్షలు దక్కినట్లే. ఇక షో వలన వచ్చిన ఫేమ్ వారికి మంచి కెరీర్ ఇస్తుంది. పరిశ్రమలో మంచి ఆఫర్స్ రావచ్చు. సింగర్ రేవంత్ ఆల్రెడీ స్టార్ సింగర్ గా సెటిల్ అయ్యాడు. శ్రీహాన్ కి కొత్తగా ఇమేజ్ యాడ్ అయ్యింది. ఎటూ స్టార్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో షోస్ ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ బిబి జోడి పేరుతో ఒక డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఈ షోలో శ్రీహాన్ పాల్గొనే అవకాశం కలదు.