Pawan Kalyan Alliance: వచ్చే ఎన్నికల్లోల ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న సంకల్పంతో జనసేనాని రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార వైసీపీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ కార్యాక్రమాల ద్వారా జనం మధ్య ఉంటున్నారు. జనం నోళ్లలో పార్టీ నానేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కంటే.. జనసేననే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా చూస్తున్నారు. పవన్‌నే ప్రతిపక్ష నేతగా భావిస్తున్నారు. ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న బలానికి, ఎన్నికల నాటికి పొత్తులు కూడా తోడైతే అధికారం కాయమన్న భావన ఏపీలో నెలకొంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పొత్తులపై ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

టీడీపీతో అయితే అలా..
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నదే జనసేనాని పవన్ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో పొత్తుల రాజకీయానికి తెరలేపారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో అధికార వైసీపీని ఓడించలేమన్న అంచనాకు వచ్చారు. ఆయన క్యాడర్‌కు, నేతలకు త్యాగాలకు సిద్ధం కావాలన్న సంకేతం ఇస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పొత్తు కుదిరితే సీట్లు పంపకం ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలుæ కలిసి పోటీచేస్తే జనసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఏపీలో జరుగుతోంది. జనసేనాని కూడా ఇందుకు సుముఖంగా పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అయితే టీడీపీ అన్ని సీట్లు త్యాగం చేయకపోవచ్చన అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అంచనా ప్రకారం జనసేనకు 20 నుంచి 30 సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారట. అంతకు మించి ఒక్క సీటు కూడా అదనంగా ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.
అలా అయితే…
టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల పంపకాల్లో తేడా వస్తే… జనసేనాని టీడీపీకి చెందిన అసంతృప్తులను జనసేన టికెట్‌పై పోటీ చేయించాలన్న వ్యూహంలో ఉన్నారట. దీని ద్వారా టీడీపీని టెన్షన్ పెట్టడంతోపాటు పొత్తులకు తాము చెప్పిన సీట్లకు అంగీకరిస్తుందన్న భావనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, టీడీపీ అసంతృప్తులు జనసేన టికెట్‌పై పోటీ చేసినా గెలిచిన తర్వావ మళ్లీ చంద్రబాబు చెంతకే చేరుతారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

బీజేపీతో కలిసి వెళితే..
ఇక ఏపీలో ప్రస్తుతం జనసే, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల్లోనూ వీరి మైత్రి కొనసాగితే అప్పుడు జనసేన పార్టీనే బీజేపీకి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏపీలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అభ్యర్థులు కూడా లేరు. గట్టిగా వెతికినా బలమైన అభ్యర్థులు 50 మందికి మంచి కనిపించరు. దీంతో అప్పుడు జనసేనానే బీజేపీకి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ కూడా పెద్దగా సీట్లు డిమాండ్ చేయదన్న అభిప్రాయం జనసేన నేతల్లో ఉంది.
మొత్తంగా ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న జనసేనాని వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నికల నాటికి ఎవరితో కలిపి వెళ్తారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వేచి చూడాలి.