Anakapalli: ఆ మహిళది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పి ఎల్ పురం గ్రామం.. రెక్క అడితేనె డొక్కాడేది. సొంత ఇల్లు లేక చిన్నపాటి రేకుల షెడ్డులో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నది. అలాంటి ఆమె జగనన్న కాలనీకి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఆశలు కల్పించడంతో స్థలం వస్తుందని ఆశపడ్డది. అప్పో సప్పోచేసి ఇల్లు కట్టుకుంటానని సంబర పడ్డది.. ఆమె దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నప్పటికీ ఇంటి స్థలం రాలేదు.. ప్రజా ప్రతినిధులను కలిస్తే సరైన సమాధానం లభించలేదు.. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ విఆర్ఓ ను కలిసింది.. ఆమె ఇల్లు కోసం అతని వద్దకు వెళితే… అతడు ఆమె ఒంటిపై కన్నేశాడు.. పలుమార్లు తన వద్దకు పిలిపించుకున్నాడు.. ఈసారి ఏకంగా లైంగిక వేధింపులకు యత్నించాడు.. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఆ మహిళ ఆ విఆర్ఓ ను ప్రతిఘటించింది.. ఆయన కార్యాలయంలోనే దేహశుద్ధి చేసింది.

గృహాన్ని స్వర్గసీమ అంటారు. కానీ అలాంటి స్వర్గసీమలు లేని వారు ఎందరో.. అలాంటి వారి అవసరాన్ని జగన్ ప్రభుత్వం క్యాష్ చేస్తుంది.. జగనన్న కాలనీ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించింది.. ఇది ఎంత లోప భూయిష్టమో అందరికీ తెలుసు.. మాగాణి భూముల్లో ఫ్లాట్లు కేటాయించి మీ చావు మీరు చావండి అని వదిలిపెట్టింది.. స్థలం వచ్చిందనే ఆశతో చాలామంది వాటిని చదును చేసుకుంటున్నారు.. అక్కడ కూడా అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు.. స్థలం ఇచ్చినందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. లంచం ఇవ్వని వారిని బెదిరిస్తున్నారు..

ఇక పి ఎల్ పురం లో జరిగిన ఘటన ప్రభుత్వ తీరుకు దృష్టాంతంగా నిలుస్తోంది.. కేవలం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది మాత్రమే.. రానివి కోకొల్లలు..తణుకు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ వెలుగులోకి రాలేదు.. పోలీసులకు చెబితే ఎక్కడ చంపేస్తారన్న భయంతో బాధితులు తమ బాధను పంటి బిగువున భరించారు. అంతేకాదు కొంతమందికి అయితే నాతో గడపాలి అని అసభ్య మెసేజ్ లు కూడా అధికార పార్టీ నాయకులు పంపించారు.. ప్రతిపక్ష పార్టీలపై అత్యంత విరుచుకుపడే అధికార పార్టీ నాయకులు ఇలాంటి ఘటనలపై స్పందించకపోవడం బాధాకరం.. ఆర్భాటంగా ప్రకటించిన జగనన్న ఇళ్ల స్కీం ఒళ్ళు అప్పగిస్తే కానీ లబ్ధి జరగదా అని ఏపీ ప్రజలు ఆరోపిస్తున్నారు.. పి ఎల్ పురం ఘటన నేపథ్యంలో జగనన్న ఇళ్ల స్కీం మరోసారి చర్చనీయాంశమైంది.