Pawan Kalyan : పవన్ కళ్యాన్ నిన్న రాజమండ్రి జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అందరూ ప్రతి ఒక్కరూ ఆనందంలో పాలుపంచుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే పాలుపంచుకుంటారు. ఇదీ పవన్ ఘనతనే.. కుష్వంత్ సింగ్ రాసిన ఒక బుక్ రాశారు. పాకిస్తాన్ విభజన సమయంలోని నవల అది. కుహాన మేధావులు ఎలా ఉంటారన్నది చూపించాడు. ఈరోజు ఆంధ్రా మేధవులు, అక్కడి నేతల తీరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
అర్థరాత్రి ప్లాన్ చేసి చంద్రబాబును అరెస్ట్ చేస్తే.. అరెస్ట్ చేసిన పద్ధతులు మాట్లాడడం లేదు. కేసు పూర్వపరాలు చర్చిస్తున్నారు. కోర్టు చేయాల్సిన పనిని బయట నేతలు ర్చిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ స్థాయిలోని వ్యక్తిని అని ఆరోపిస్తున్నారు.
అయితే ఇద్దరి నేతల కలయిక ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టించే అవకాశం ఉంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ స్పందించారు. అరెస్టును ఖండిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో.. ఎవరికీ తెలియకుండా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. అర్థరాత్రి ఏపీ పోలీసుల అడ్డగించడంతో వెనుతిరిగారు. ఇప్పుడు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు.
ఇలా ఆపదలో ఉన్న వారికి అండగా పవన్ చూపిన చొరవ.. పొత్తులపై కమిట్ మెంట్ ప్రకటన అందరినీ ఫిదా చేసింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ప్రతిబింబమే కష్టకాలంలో చంద్రబాబుకు అండ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.