Atchannaidu: జూనియర్ ఎన్టీఆర్ పై అచ్చెన్న స్ట్రాంగ్ రియాక్షన్.. వైరల్

చంద్రబాబు అరెస్టు తరువాత నందమూరి, నారా కుటుంబం స్పందించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు అరెస్ట్ ఖండించారు. అరెస్టు చేసే విధానాన్ని తప్పుపట్టారు.

Written By: Dharma, Updated On : September 15, 2023 5:58 pm

Atchannaidu

Follow us on

Atchannaidu: మరోసారి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూవివాదాలు ముసురుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై తారక్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం చర్చకు దారితీస్తోంది. భువనేశ్వరి పై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు, ఎన్టీఆర్ మెడికల్ కాలేజీ పేరు మార్పు సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ పై చర్చ నడిచింది. ఆ సమయంలో చాలా సమయస్ఫూర్తితో తారక్ ప్రకటన చేశారు. కానీ అది టిడిపి శ్రేణులకు స్వాంతన కలిగించలేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైతం తారక్ నోరు మెదపకపోవడంతో రకరకాల ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబు అరెస్టు తరువాత నందమూరి, నారా కుటుంబం స్పందించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు అరెస్ట్ ఖండించారు. అరెస్టు చేసే విధానాన్ని తప్పుపట్టారు. అటు తరువాత బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఆయన సోదరులు సైతం చంద్రబాబును పరామర్శించారు. హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో రకరకాల చర్చకు కారణం అవుతోంది. సినీ పరిశ్రమ నుంచి రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, నట్టి కుమార్ లాంటి వారు స్పందించారు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్ ఫోన్ చేసి మరి సంఘీభావం తెలిపారు.

గత కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటు రాజకీయ వేదికలను సైతం పంచుకోవడం లేదు. హైదరాబాదులో ఆ మధ్యన అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఆహ్వానం అందించినా ముఖం చాటేశారు. ఎన్టీఆర్ స్మారకార్థం నాణాన్ని ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి సైతం తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ గైర్హాజరయ్యారు. ఇప్పుడు చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసినా కనీసం స్పందించలేదు. దీంతో వారి మధ్య కోలుకోలేని అగాధం ఏర్పడిందని తెలుస్తోంది.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. సరిగ్గా అటువంటి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో.. చంద్రబాబు అరెస్ట్ అయిన నాడు ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికి నందమూరి తారక రామారావుకు శాంతి చేకూరిందని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. దీనిపై టిడిపి శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి ఉద్యమ కార్యాచరణను వివరించారు. ఈ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని ప్రస్తావించారు. దీనిపై అచ్చెనాయుడు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఎందుకు స్పందించడం లేదు ఆయన్ని వెళ్లి అడగవయ్యా. నన్ను అడిగితే నేనేం చెబుతా.. ఎందుకు స్పందించలేదు ఆయన్ని అడగండి.. మేము ఎవ్వరినీ స్పందించాలని అడగం.. అంటూ అచ్చెనాయుడు విసురుగా సమాధానం చెప్పారు.దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మండుతున్నట్లుంది అంటూ మీంమ్స్ ట్రోల్ అవుతున్నాయి.