Pawan Kalyan: సాగరతీరాన్ని పవన్ వీడుతున్నారు. తన జనసేన నేతలు, కార్యకర్తలకు బెయిల్ రావడంతో ఇక తన మకాంను మంగళగిరికి మారుస్తున్నాడు. రిమాండ్ లో ఉన్న మిగతా 9మంది నేతలకు బెయిల్ తీసుకువచ్చేందుకు హైకోర్టుకెక్కుతున్నారు. జనసేన లీగల్ టీంతో కలిసి పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి విజయవాడకు వచ్చేశారు. ఈ మేరకు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో పవన్ బయలు దేరారు.

విజయవాడకు వచ్చాక మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచే అధికార వైసీపీ సర్కార్ పై ఫైట్ కు డిసైడ్ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడనున్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ లో పవన్ ను పోలీసులు నిర్బంధించారు. కనీసం బయటకు రాకుండా హోటల్ కే పరిమితం చేశారు. తనను కనీసం ప్రజలతో అభివాదం కూడా చేయనివ్వడం లేదని పవన్ ఒక వీడియోలో వాపోయారు.
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అక్కడే తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.
విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారని.. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
విశాఖ నుంచి ఇప్పుడు విజయవాడకు పవన్ యుద్ధం షిఫ్ట్ అయిపోయింది. మంగళగిరి నుంచే వైసీసీ సర్కార్ పతనాన్ని శాసిస్తానని అంటున్నారు. ఈసాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి విశాఖలో తనను అడ్డుకున్న తీరుపై కడిగేయడానికి రెడీ అయ్యారు. అరెస్ట్ అయిన జనసైనికులను విడిపించుకోవడం.. వైసీపీ సర్కార్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నడుం బిగించారు.విశాఖలో నిర్బంధం కంటే మంగళగిరి నుంచే ప్రజలకు పిలుపునివ్వాలని.. పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సాయంత్రం పవన్ ఏం చేయనున్నారన్నది తేలనుంది.