Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయి. రౌడీయిజం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని ఇప్పటంలో రహదారుల విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. వ్యతిరేక వర్గంలో ఉంటే వారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. సగటు పౌరుడికి భయం కలుగుతోంది. మనుషుల మధ్య ఉంటున్నామా? ఉగ్రవాదుల నడుమ బతుకుతున్నామా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా అధికార పార్టీ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది.

దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇప్పటం వాసులకు సానుభూతి తెలిపారు. నష్టపోయిన ఇంటికో రూ. లక్ష పరిహారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు. వైసీపీ నేతల తీరును ఎండగడతామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎలా అధికారం చేపడుతుందో చూస్తామని సవాలు విసిరారు. పేదవాడి పక్షాన ఉంటున్నామంటూ వారినే కష్టాలకు గురిచేసే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమే.
యువత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మాది రౌడీ సేన కాదని విప్లవ సేన అని పేర్కొన్నారు. ప్రజల అభిమానంతో ఏ పని అయినా చేస్తాం. ఇప్పటంలో ప్రతి గడప కూల్చడం అవివేకం. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం. ఇంత దారుణంగా వ్యవహరిస్తే పాపం వారి బతుకు ఎలా? వారు ఎక్కడ ఉండాలి? ఎలా కుటుంబాలను పోషించుకోవాలి? ఇంత దారుణంగా ఇళ్లు కూల్చడం రౌడీయిజానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే వారి ఇళ్లు కూల్చింది.
ప్రధానితో తను ఏం మాట్లాడతారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించడంపై తప్పుబట్టారు. ప్రధానితో తాను దేశ భద్రత, సంక్షేమ పథకాల అమలు వంటి ప్రజామోద విషయాల గురించి చర్చిస్తుంటా. మీలా మోకాళ్ల మీద పడి రక్షించాలని వేడుకోవడం నాకు తెలియదని బదులిచ్చారు. రాజకీయాలు రౌడీయిజానికి మార్కుగా నిలుస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ రాక్షసానందం పొందే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో అబాసుపాలు కాక తప్పదు. ప్రజలను నిత్యం వేధింపులకు గురి చేసేందుకు సర్కారు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
