Pawan Kalyan : రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ అధినేత నిర్వహిస్తున్న ‘వారాహి యాత్ర ‘ చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ స్పీచ్ తో ‘వారాహి యాత్ర’ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రసంగంలో ఆయన జనసేన పార్టీ అధికారం లోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతానో చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా నైపుణ్యం ఉన్న యువతకు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే 10 లక్షల రూపాయిల పెట్టుబడి జనసేన ప్రభుత్వం ఇస్తుంది అనే మాట యువతని ఎంతో ఆకట్టుకుంది.
ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ , ఆర్ధిక కష్టాలు ఉండడం వల్ల , వ్యాపారాలు చేయలేకపోతున్న యూత్ మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ హామీ ఎంతో మందిలో కొత్త ఆశని చిగురించేలా చేసింది. సంక్షేమ పథకాలకు బదులుగా ఇలా జీవితం స్థిరపడిపోయే గొప్ప పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తున్నారు.
ఇక నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొంత మంది ముఖ్యమైన ప్రముఖులతో భేటీ అయ్యాడు. కాసేపటి క్రితమే ఆయన చేబ్రోలు చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు , కార్మికులలో నమ్మకం నిలిపాయి.
ఆయన మాట్లాడుతూ ‘మీరు జనసేన పార్టీ ని నమ్మి గెలిపిస్తే, మీ కష్టాలను ఎలా తీరుస్తానో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ చేబ్రోలు ని సిల్క్ సిటీ గా చేసి చూపిస్తాను. అలాగే నేను ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నా కూడా , ఎప్పుడూ పదవులను అడగలేదు. కానీ మీకోసం, నేను GST గురించి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టెలాగా చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీని నమ్మి ఓటు వెయ్యండి. మేము మీకు ఇచ్చిన హామీలను రెండేళ్లలో నెరవేర్చలేదు అంటే , మీ అసంతృప్తి ని వ్యక్తపరచండి. నేను రాజీనామా చేసేస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.
పవన్ ఇంత ధైర్యంగా ప్రజలకే పనిచేయకపోతే రాజీనామా చేస్తానన్న మాట ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో అందరినీ కదిలిస్తోంది. పవన్ పై విశ్వాసం కలిగేలా చేస్తోంది. పవన్ అభ్యర్థన చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఆయనకే ఓటు వేయాలన్న నమ్మకం జనాల్లో కలుగుతోంది.
దమున్న నాయకుడి మాట @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra pic.twitter.com/n6sWr1l5sn
— Prasannakumar Nalle (@PrasannaNalle) June 15, 2023