Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘#OG’. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘బ్రో’ సినిమా కూడా రీమేక్ యే. ఫ్యాన్స్ ఈ విషయం లో చాలా అసంతృప్తి తో ఉన్నారు, అలాంటి సమయం లో #RRR మూవీ మేకర్స్ #OG చిత్రాన్ని ప్రకటించగానే హైప్ మామూలు రేంజ్ లో రాలేదు.
కేవలం ప్రకటన కి సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్, ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యినప్పటి నుండి ప్రతీ వారం ఎదో ఒక అదిరిపోయే రేంజ్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో అంచనాలను రెట్టింపు చేస్తూ పొట్టున్నారు మేకర్స్. ఇక రీసెంట్ గా ఈ సినిమా క్యాస్టింగ్ విషయం లో కూడా ఎన్నో ముఖ్యమైన ప్రకటనలు చేసింది మూవీ టీం.
ఇప్పటి వరకు ఈ సినిమా లో ప్రియాంక మోహన్ , ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ మరికొంత మంది ముఖ్యమైన నటీనటులు షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా అడుగుపెట్టబోతున్నాడు. నేడు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. ఆయనకీ ఇందులో నటిస్తున్నందుకు గాను దాదాపుగా 30 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారట మేకర్స్.
మరో పక్క పవన్ కళ్యాణ్ 100 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు, మిగిలిన నటీనటుల రెమ్యూనరేషన్స్ మొత్తం కలిపితే 150 కోట్ల రూపాయిలు అవుతుందని అంచనా. కేవలం రెమ్యూనరేషన్స్ ఈ రేంజ్ లో ఉంటే, ఇక సినిమా బడ్జెట్ మొత్తం కలిపితే నిర్మాతకి 300 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ పభుత్వం ఇవ్వదు అనే విషయం అందరికీ తెలుసు. మరి ఇంత బడ్జెట్ అంటే రిస్క్ చేస్తున్నాడేమో అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి టికెట్ రేట్స్ కోసం నిర్మాతలు ఏమి చేస్తారో చూడాలి.