Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుల నుండి వారాహి విజయ యాత్ర ని విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు భీమవరం వరకు చేరుకుంది. భీమవరం లో నేడు జరిగిన సభకి అభిమానులు వేలాదిగా తరళివచ్చి అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలికారు. గత రెండు రోజుల నుండి ఆయన భీమవరం లోనే ఉన్నాడు.
28 వ తారీఖునే ఆయన సభ ని నిర్వహించాల్సి ఉంది. కానీ విపరీతమైన జ్వరం రావడం వల్ల, నేటి వాయిదా వేశారు. ఈ గ్యాప్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ పై రీసెంట్ గా జరిగిన అమ్మవడి సభలో చాలా తీవ్రమైన విమర్శలు చేసాడు. ఆయన వ్యక్తిగత విషయాలను బయటకి తీసి చాలా నీచంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా వ్యక్తిగత విమర్శలు చెయ్యడం వైసీపీ పార్టీ కార్యకర్తలకు కూడా మింగుడు పడనివ్వకుండా చేసింది.
దీనికి భీమవరం లో పవన్ కళ్యాణ్ చాలా ధీటుగా సమాధానం చెప్పాడు, ఆయన మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావ్, నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు, మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు నేను చెబుతాను, నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త, నేను పాలసీల గురించి మాట్లాడితే, దానికి సమాధానం ఇవ్వకుండా, ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని దిగజారి మాట్లాడుతున్నావ్’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
చెవుల్లో నుండి రక్తం కారే స్థాయిలో జగన్ కి సంబంధించి వ్యక్తిగత విషయాలు ఏమి ఉంటాయబ్బా?,అని ఆలోచిస్తున్నారు అభిమానులు. అతని వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలుసు, సోషల్ మీడియా లో దశాబ్దం నుండి అవి ప్రచారం అవుతూనే ఉన్నాయి, వాటి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ మనకి తెలియని విషయాలు కూడా ఎన్నో పవన్ కళ్యాణ్ దగ్గర వీడియో ప్రూఫ్స్ తో సహా ఉన్నాయట. మరి అవి ఏమి అయ్యుతుందో చూడాలి.
#VarahiVijayaYatra pic.twitter.com/U7msAEkk3g
— Anand Vasiraju (@Pa1Veera) June 30, 2023