Homeజాతీయ వార్తలుKTR Meeting : కేటీఆర్‌ మీటింగ్‌.. చికెన్‌ ఖతమైంది.. బగారా మాయమైంది

KTR Meeting : కేటీఆర్‌ మీటింగ్‌.. చికెన్‌ ఖతమైంది.. బగారా మాయమైంది

KTR Meeting : ఓ వైపు గిన్నెల నిండా బగారా బువ్వ, కమ్మగ గొడుతున్న నెయ్యి వాసన. ఇంకో కెల్లి చికెన్‌ కూర, నూనె, కారం, మసాలలో మునిగి తేలిన పెద్దపెద్ద ముక్కలు.. చూత్తేనే నాల్కల నీళ్లురుతున్నయి. పోలీసులు కావలి ఉన్నప్పటికీ కాళ్లకు పని చెప్పిర్రు. ఎండ గొడతాంటే ఎవలు మాత్రం ఆగుతరు? పోలీసులు బెదిరిచ్చిన ఎవలు ఆగలే. దొరికింది దొరికినట్టు ఊడ్చిర్రు. ప్లేట్లల్లో కంకెడు కంకెడు కోడికూర తునకలు, బగార బువ్వ వేసుకున్నరు. అంతేకాదు అక్కడ్నే బగ్గ తిన్నరు. కొందరయితే ఇంట్లకు పొట్లాలు కట్టకపోయిర్రు. ఇదేంది ఇదేం ఇచ్చంత్రం? జనం గూడ గిట్ల కూడ ఉంటర? అని అనుకోవద్దు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే…

ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ శుక్రవారం మహబూబాబాద్‌ టూర్‌కు వచ్చిండు. ఆయన ఎమ్మటి మంత్రి సత్యవతి రాథోడ్‌, దయాకర్‌రావు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ గూడ ఉన్నరు. పట్నంలో కట్టిన కూరగాయల మార్కెట్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ ఓపెన్‌ చేసిర్రు. పోడు రైతులకు పట్టాలు గూడ ఇచ్చిర్రు. ముందే అనుకన్న టైంకు కేటీఆర్‌ వచ్చిండు. అక్కడ పెట్టిన మీటింగ్‌ల మాట్లాడిండు. మీటింగ్‌ కు కూడ జనం బాగానే వచ్చిర్రు. బువ్వ పెడ్తం, వచ్చినోళ్లకు మగోళ్లకు మూడు వందలు, ఆడోళ్లకు రెండొందల యాభై ఇత్తమని ముందే లీడర్లు చెప్పిర్రు. వచ్చినోళ్లకు టోకెన్లు కూడ ఇచ్చిర్రు. మీటింగ్‌ల కేటీఆర్‌ కేంద్రం మీద విమర్శల చేసిండు. కాంగ్రెస్‌ మీద గరం అయిండు. పైన ఎండదంచికొడుతుంటే.. మీటింగ్‌కు వచ్చిన ఓళ్లకు కడుపుల కాలుడు షురూ అయింది. ఇంకేమున్నది జనాల మనసు అన్నం గిన్నెలు, కూర గిన్నెల మీద కాయిసు పడ్డది.

మీటింగ్‌ ముచ్చట ఇడిసిర్రు. కూరలు వండిన కెళ్లి ఉరికిర్రు. పోలీసులు కావలి ఉన్నప్పటికీ ఆగలే. జనం మీద పడుడుతోని పోలీసులకు గూడ వశం కాలె. ఎవలకు దొరికింది వాళ్లు తిన్నరు. తినుడే కాదు పేపర్‌ ప్లేట్లల్ల కట్టుకుని పోయిర్రు. ఓ దిక్కు మీటింగ్‌ నడుస్తనే ఉన్నది అయినా ఉగ్గపట్టుడు జనంతోని కాలె. అసలే కోడికూర, బాగార బువ్వ.. కమ్ముగ తిన్నరు. ఈ ముచ్చట బీఆర్‌ఎసోళ్లకు తెల్సి వాళ్ల కూడ ఆపేందుకు ఉరికొచ్చిర్రు. జనాన్ని ఆపే వశం గాక సప్పుడు చేయక పోయిర్రు. దసరా సినిమాల నానీ అన్నట్టు కోడికూర, బగార బువ్వ మా సెంటిమెంట్‌ అని మరోసారి రియల్‌ లైఫ్‌లో చెప్పిర్రు. ఆ సినిమాలో మందు, బోటి కూర గురించి చెప్పిండు గదా! మరి మీరేంది ఇట్ల అంటున్నరు అని అనుకోవద్దు. అక్కడ మందు ఉన్నది, బోటి కూర గూడ శితం ఉన్నది. ఇడ జనం ఎక్కువ ఉన్నరని బోటి పెట్టలె. మందయితే దూరంగ ఉన్న వైన్‌ షాపులల్ల తాగిర్రు. అది తాగినంకనే కూరల మీద పడ్డరు. మొత్తానికి బోగన్లు మొత్తం ఊడ్సిర్రు. ఆ వీడియోలు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టా గ్రామ్‌లో ఒకటే తిరుగుతున్నయ్‌. వాటిని చూసిన కొంతమందేమో ఇదేం కరువురా భయ్‌ గిట్ల ఎగబడి తిన్నరు అని అంటే, మరికొందరమే కోడికూర, బగార బువ్వ బగ్గ తిన్నరు కదా అంటూ కామెంట్లు చేసిర్రు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular