Pawan Kalyan: ఒక్కో మృతికి ఒక్కో లెక్క.. తీవ్రత దృష్ట్యానే పరిహారం.. జగన్ సర్కార్ ‘పరిహారం’ లెక్కలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెం పోరస్ రసాయన పరిశ్రమలో నిన్న రాత్రి జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 13మంది తీవ్ర గాయాలపాయ్యారు. దీనిపై జనసేనాని పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన సాయంపై పవన్ ఫైర్ అయ్యారు.

ఏలూరులో అగ్ని ప్రమాద బాధితులకు జగన్ ప్రభుత్వం ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈషాయంపై పవన్ స్పందిస్తూ ఒక్కో మృతి కుటుంబానికి రూ.కోటి చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.
పవన్ ప్రశ్నించిన లాజిక్ లో నిజముంది. ఒక్కో దుర్ఘటనలో ఒక్కో రకమైన సాయం అందించడం ఏంటని పవన్ నిలదీశారు. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ వందలమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాడు ఇదే సీఎం జగన్ ఏకంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున ప్రభుత్వ సాయం అందజేయడం గమనార్హం. కానీ ఇప్పుడు మాత్రం కేవలం రూ.25 లక్షలు మాత్రమే పరిహారంగా ప్రకటించడాన్ని పవన్ ప్రశ్నించారు.
బాధితులు ఎక్కడైనా బాధితులే.. ఎవరివైనా ప్రాణాలే. అలాంటి సమయంలో విశాఖ ఎల్జీ పరిశ్రమ దుర్ఘటనకు, ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమ విషాదం రెండూ ఒకటే. కానీ మరణించిన వారి విషయంలో జగన్ సర్కార్ పక్షపాతం చూపడాన్ని పవన్ ప్రశ్నించారు.
ఇప్పటికైనా మరణించిన వారికి రూ. కోటి పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన పవన్ చేసిన డిమాండ్ కరెక్ట్ అని పలువురు కొనియాడుతున్నారు. ఏపీలో ఒక్కో ప్రమాదానికి ఒక్కో పరిహారం ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు.